cheating: రూ. 56 కోట్ల చీటింగ్ కేసు, ఆంధ్రా బార్డర్ లో అదృష్టం దరిధ్రం పట్టినట్లు పట్టింది !

ప్రజల నుంచి వందల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని జెండా ఎత్తేశారు. నిందితులకు ఆంధ్రా బార్డర్ లో అదృష్టం దరిధ్రం పట్టినట్లు పట్టింది.

చెన్నై: అమాయకులు, బ్లాక్ మనీ ఉన్న వాళ్లను టార్గెట్ చేసుకున్న కొందరు ఓ కంపెనీ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్-తమిళనాడు బార్డర్ లో హెడ్ ఆఫీస్ పెట్టారు. రాష్ట్ర రాజధానిలో బ్రాంచ్ లు పెట్టారు. అధిక మొత్తంలో వడ్డీ ఇస్తామని ప్రజలకు మాయమాటలు చెప్పారు. వందల మంది అమాయకుల నుంచి కోట్ల రూపాయలు తీసుకుని చాలా కాలం పాటు అధిక వడ్డీ ఇచ్చారు. చివరికి మనోళ్ల అసలు స్వరూపం చూపించారు. ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు భారీ మొత్తంలో ప్రజల నుంచి కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని జెండా ఎత్తేసిన బోగస్ కంపెనీ నిర్వహకులు చివరికి కోర్టు విచారణకు కూడా హాజరుకాకుండా తప్పించుకోవడంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులకు ఆంధ్రా బార్డర్ లో అదృష్టం దరిధ్రం పట్టినట్లు పట్టింది.

 రూ. 56 కోట్ల చీటింగ్ కేసులో ?

రూ. 56 కోట్ల చీటింగ్ కేసులో ?

అధిక వడ్డీ ఇస్తామని చెప్పి రూ. 56 కోట్ల 82 లక్షల రూపాయల మోసం చేసిన కేసులో తమిళనాడుకు చెందిన ఐఎఫ్ఎస్ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఎగ్జిక్యూటివ్‌లతో సహా మొత్తం 10 మందిపై అరెస్టు వారెంట్‌ జారీ అయ్యింది. చెన్నైలోని ఆర్థిక మోసాల కేసులు విచారణ చేస్తున్న ప్రత్యేక కోర్టును నిందితులను అరెస్టు చెయ్యాలని అరెస్టు వారెంట్లు జారీ చేసి వాళ్లు ఎక్కడ ఉన్నా అరెస్టు చెయ్యాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

 ఆంధ్రా బార్డర్ లో హెడ్ ఆఫీస్

ఆంధ్రా బార్డర్ లో హెడ్ ఆఫీస్

ఐఎప్ సీ కంపెనీ వేలూరు జిల్లాలోని (ఆంధ్రప్రదేశ్-తమిళనాడు బార్డర్)లోని గుడిపడిలో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేశారు. మాది అంతర్జాతీయ ఆర్థిక సేవలు అందించే కంపెనీ అని ప్రచారం చేశారు. మీరు ఎంత పెట్టుబడి పెడితే అంత డబ్బులకు 10 నుంచి 25 శాతం నెలవారీ వడ్డీ ఇస్తానని ఆ కంపెనీ భారీ ఎత్తున ప్రచారం చేసింది.

 200 మంది అమాయకులకు టోపీ

200 మంది అమాయకులకు టోపీ

ఈ విధంగా ఆ కంపెనీ రూ. 56 కోట్ల రూపాయల వరకు డిపాజిట్ల రూపంలో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. దీనికి సంబంధించి 200 మంది ఇన్వెస్టర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐఎఫ్‌ఎస్ మార్క్ ఆపర్చునిటీ డెవలప్‌మెంట్ లిమిటెడ్ కంపెనీతో పాటు ఆరు కంపెనీల డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌లు, ఉద్యోగులపై ఆర్థిక నేరాల విభాగం పోలీసులు రూ, 56,82,89,879,000 రూపాయలను మోసం చేసినందుకు కేసులు నమోదు అయ్యాయి.

 మోహన్ బాబు అండ్ కో ఎక్కడ ?

మోహన్ బాబు అండ్ కో ఎక్కడ ?

ఈ కేసుకు సంబంధించి కంపెనీ డైరెక్టర్ మోహన్‌బాబు, కంపెనీ పదాధికారులు శరవణకుమార్, గుప్పురాజ్, జగన్నాథన్ సహా మొత్తం 13 మందిని ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలోని ఆర్థిక సంస్థల మోసం కేసులను విచారణ చేస్తున్న ప్రత్యేక కోర్టులో కేసు విచారణలో ఉంది. కేసు విచారణకు రాగా, ముగ్గురు నిందితులు మాత్రమే ఈ కేసు విచారణకు హాజరౌతున్ననారు. మిగిలిన 10 మంది కనిపించడంలేదని పోలీసులు కోర్టుకు చెప్పారు. కోర్టు విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న. వారిని అరెస్టు చేసి ఫిబ్రవరి 28న కోర్టు ముందు హాజరుపరచాలని కేసు దర్యాప్తు అధికారిని ఆదేశించిన న్యాయమూర్తి నిందితులపై అరెస్టు వారెంట్ జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+