మెట్రో ముప్పు: ఇనుపరాడ్ పడి టెక్కీ మృతి
హైదరాబాద్: తమిళనాడు రాజధాని చెన్నైలో నిర్మిస్తున్న మెట్రో రైలు స్టేషన్ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలను బలి తీసుకుంది. మోటార్ సైకిల్‌పై వెళ్తున్న టెక్కీపై నిర్మాణంలో ఉన్న మెట్రో స్టేషన్ నుంచి ఇనుపరాడ్ పడింది. దాంతో అతను ప్రాణాలు వదిలాడు.
రద్దీగా ఉండే చెన్నై విమానాశ్రయం రోడ్డులో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఒటిఎ) మెట్రో స్టేషన్ నిర్మాణం జరుగుతోంది. గిరిధర్ అనే 30 ఏళ్ల టెక్కీపై పది అడుగుల పొడుగు గల రాడ్ పడింది. అతను మడిపాక్కం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.

అతను ఓ ఐటి కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ ప్రమాదం బుధవారం ఉదయం 8 గంటల 15 నిమిషాల ప్రాంతంలో జరిగింది.
గత మూడేళ్లుగా మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ పనుల కారణంగా జరిగిన ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ మరణాలన్నీ గ్రైడర్స్, క్రేన్స్ కూలడం వల్ల సంభవించినవే.












Click it and Unblock the Notifications