కేరళ సిఎం ఊమేన్ చాందీకి తెలుగువాళ్ల సత్కారం
చెన్నై: కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి చెన్నై తెలుగు సంఘాలు సన్మానం చేశాయి. ఈ సందర్భంగా ఆయనకు మెమెంటో కూడా అందజేశాయి. దాంతో పాటు ఓ వినిత పత్రాన్ని కూడా సమర్పించాయి. ట్రావంకోర్ దేవస్థాసం ట్రస్టు బోర్డు సభ్యుడిగా తెలుగు లేదా తమిళం, కన్నడ వ్యక్తిని నియమించాలని చెన్నై తెలుగు సంఘాల ప్రతినిధులు ఊమెన్ చాందీని కోరారు.

తెలుగు, తమిళ, కన్న భక్తులకు, అయ్యప్ప స్వామికి సేవలు అందించడానికి అది ఉపకరిస్తుందని వారన్నారు. ఊమెన్ చాందనీని కలిసినవారిలో చెన్నై తెలుగు సంఘాల గవర్నింగ్ బాడీ సభ్యులున్నారు.
కె. జగదీశ్వర్ రెడ్డి, జెకె రెడ్డి, ఎంవి నారాయణ గుప్తా, జి. ఇజ్రాయిల్, రవి బాబు, వి. విజయేంద్ర రావు, టంగుటూరి రామకృష్ణ, వినుకొండ కళ్యాంధర్, పి. శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉమెన్ చాందీని కలిసినవారిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications