వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ 6 బ్యాంకుల చెక్కులు చెల్లవు: ఎస్బీఐ కీలక ప్రకటన

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ తమ ఖాతాదారులకు కీలక సూచన చేసింది. ఇటీవల ఎస్బీఐలో విలీనమైన ఆరు బ్యాంకులకు చెందిన పాత చెక్‌బుక్‌లు, ఐఎఫ్‌ఎస్‌ కోడ్‌లు సెప్టెంబర్‌ 30 నుంచి చెల్లబోవని స్పష్టం చేసింది.

అంతేగాక, సదరు బ్యాంకు ఖాతాదారులు వెంటనే కొత్త చెక్‌బుక్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ ఏడాది ఆరంభంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనేర్‌ అండ్‌ జైపూర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ రాయ్‌పూర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌ సహా భారతీయ మహిళా బ్యాంకులు ఎస్బీఐలో విలీనమైన విషయం తెలిసిందే.

కాగా, ఈ అనుబంధ బ్యాంకుల్లోని ఖాతాదారులు ఇప్పటికీ పాత చెక్‌బుక్‌లనే వాడుతున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 30 నుంచి ఆ పాత చెక్‌బుక్‌లతో పాటు ఐఎఫ్‌ఎస్‌ కోడ్‌లు కూడా పనిచేయబోవని ఎస్బీఐ ట్విట్టర్‌ ద్వారా స్పష్టం చేసింది.

తమ ఖాతాదారులు వీలైనంత త్వరగా కొత్త చెక్‌బుక్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని, అలాగే కొత్త ఐఎఫ్‌ఎస్‌ కోడ్‌లు కూడా పొందాలని ఎస్బీఐ పేర్కొంది. ఇంటర్నెట్‌, మొబైల్‌ బ్యాకింగ్‌, ఏటీఎం లేదా సొంత బ్యాంకు బ్రాంచీల నుంచి ఈ కొత్త చెక్‌బుక్‌లను తీసుకోవచ్చని భారతీయ స్టేట్ బ్యాంక్ వివరించింది.

English summary
Are you a State Bank of India (SBI) customer holding an account in its subsidiary banks? Soon, you have to get a new cheque book along with the Indian Financial System (IFS) code. The country's largest lender has asked the customers of its subsidiary banks to apply for new cheque books and IFS codes "as soon as possible".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X