పోలీసుల బస్సును పేల్చేసిన మావోలు: ఇద్దరు మృతి, 30మందికి గాయాలు

Subscribe to Oneindia Telugu

బీజాపూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్‌లో మావోయిస్టులు మరో ఘాతుకానికి తెగడ్డారు. పోలీసులు వెళుతున్న బస్సును ఐఈడీ బాంబులతో పేల్చేశారు. ఈ ఘటనలో బస్సులోని ఇద్దరు పోలీసులు మృతి చెందగా, మరో 30మందికి గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. బీజాపూర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు బందోబస్తుగా వెళుతున్న సమయంలో మావోయిస్టులు ఈ దాడికి తెగబడ్డారు.

ఇటీవల జరిగిన మావోయిల ఎన్‌కౌంటర్‌కు ప్రతికారంగా మావోయిస్టులు దాడులకు దిగుతున్నట్లు తెలుస్తోంది. తాజా దాడితో అప్రమత్తమైన పోలీసులు.. భారీ బందోబస్తు, అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కాగా, 2005లో ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు జరిపిన ఇలాంటి దాడిలోనే సుమారు 47మంది పోలీసులు మృతి చెందారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Around two security personnel were killed and five were injured in IED attack on police party vehicle near Chhattisgarh's Bijapur area on Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి