వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా స్క్రిప్ట్ ప్రకారమే: మోడీ ఇష్యూపై బాగల్, భద్రతలో రాజీలేదు: ఖర్గే

|
Google Oneindia TeluguNews

పంజాబ్ పర్యటనలో ప్రధాని మోడీకి చుక్కెదురు వ్యవహారంపై దుమారం కంటిన్యూ అవుతుంది. కాంగ్రెస్- బీజేపీ నేతలు విమర్శల జడివాన కొనసాగుతోంది. తాజాగా ఛత్తీస్ గడ్ సీఎం భూపేష్ బాగల్ స్పందించారు. సభలో 70 వేల కుర్చీలు ఉండగా.. 700 మందే ఉన్నారని ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు పార్టీ నేతల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది.మరోవైపు కేంద్ర హోం శాఖ ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. సదరు కమిటీ భద్రత లోపంపై అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది.

ప్రణాళిక ప్రకారం..

ప్రణాళిక ప్రకారం..


ఈ క్రమంలో బాగల్ కూడా రియాక్ట్ అయ్యారు. ప్రధాని మోడీ చేసిన ఆరోపణలు స్క్రిప్ట్ అని ఆరోపించారు. ప్రణాళిక ప్రకారం వివాదం రాజేశారని తెలిపారు. అంతే తప్ప అందులో నిజం లేదని చెప్పారు. కావాలని ప్రణాళిక ప్రకారం అమలు చేశారని మండిపడ్డారు.

10 రెట్లు ఎక్కువ

10 రెట్లు ఎక్కువ

ఇటు సీనియర్ కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే కూడా విరుచుకుపడ్డారు. బహిరంగ సభకు వెళ్లే సమయంలో ప్రధాని మోడీకి భద్రతా కల్పించకపోవడం కేంద్ర ప్రభుత్వ తప్పిదమేనని పేర్కొన్నారు. మోడీ సెక్యూరిటీకి ఎస్పీజీ, ఐబీ, పారా మిలిటరీ ఫోర్స్ ఉండగా.. భద్రత కల్పించకపోవడం ఏంటీ అని అడిగారు. అంతేకాదు నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ కన్నా కూడా ఎక్కువ భద్రతను కల్పించారని గుర్తుచేశారు. వారి కన్నా 10 రెట్ల ఎక్కువ భద్రత ఇచ్చారని పేర్కొన్నారు. అంతేకాదు బెస్ట్ ఫారిన్ బుల్లెట్ ప్రూప్ కారు కూడా ఉందని తెలిపారు. కానీ బీజేపీ మాత్రం పంజాబ్ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తుందని వివరించారు.

బీజేపీ, నడ్డా విమర్శలు

బీజేపీ, నడ్డా విమర్శలు

దళిత సీఎం అయిన చన్నీ లక్ష్యంగా బీజేపీ, నడ్డా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. చివరి క్షణంలో ప్రధాని పర్యటన మార్పు జరిగిందని ఖర్గే గుర్తుచేశారు. హెలికాప్టర్ కాకుండా రోడ్డు మార్గంలో వెళ్లడం.. అదీ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకోవడానికి కారణమైందని చెప్పారు. ఘటనకు సంబంధించి పంజాబ్ ప్రభుత్వం హైకోర్టు జడ్జీ, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీలతో దర్యాప్తు జరిపిస్తోందని తెలిపారు. మోడీ దేశానికి ప్రధానమంత్రి అని.. ఆయనను తాము గౌరవిస్తామని తెలిపారు. రాజకీయంగా మాట్లాడుతాం కానీ.. భద్రత ఇవ్వడంలో.. గౌరవం ఇవ్వడంలో రాజీ పడబోం అని ఖర్గే స్పష్టంచేశారు.

English summary
Chhattisgarh CM Baghel Calls PM's Security Breach 'scripted Stunt' To Defame Punjab Govt
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X