Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శాడిస్ట్ టీచర్.. రెండో తరగతి చిన్నారికి ఇంత పెద్ద శిక్షా..?

సాధారణంగా స్కూల్ లో పిల్లలు అల్లరి చేస్తే టీచర్లు చిన్న చిన్న శిక్షలు విధిస్తుంటారు. మొట్టికాయలు వేయడం, బెత్తంతో చిన్నగా బాదడం, గుంజీలు తీయించడం, చెవులు మెలిపెట్టడం లాంటివి చేస్తుంటారు. విద్యార్థులు అల్లరి చేస్తేనో, హోమ్ వర్క్ పూర్తిచేయకుండా వస్తేనో ఇలాంటివి చేస్తుంటారు టీచర్లు. అయితే ఓ శాడిస్టు టీచర్ మాత్రం రెండో తరగతి తరగతి చదువుతున్న ఆ చిన్నారికి ఎవరూ ఊహించని శిక్ష విధించింది. ఏకంగా 100 గుంజీలు తీయాలని ఆదేశించింది.

ఛత్తీస్‌ గఢ్‌ లోని ప్రతాప్‌ గఢ్‌ లో షాకింగ్ ఘటన జరిగింది. రెండో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల చిన్నారిపై మహిళా టీచర్ నమ్రతా గుప్తా దాష్టీకం ప్రదర్శించింది. ఇప్పుడిప్పుడే పాఠాలు నేర్చుకుంటున్న ఆ బాలికపై కఠినంగా ప్రవర్తించింది. అడగకుండా టాయిలెట్ కు వెళ్లిన పాపానికి.. క్రమశిక్షణ పేరుతో ఆ చిన్నారికి ఏకంగా 100 గుంజీలు తీయాలని శిక్ష విధించింది. చిన్నారి గుంజీలు తీస్తుంటే రాక్షసానందం పొందింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

టీచర్ నమ్రతా గుప్తా.. చిన్నారిని అలా బలవంతంగా 100 గుంజీలు తీయించింది. అంతేకాక బాలికను కర్రతో కొట్టింది. అనంతరం చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఎక్కువసేపు గుంజీలు తీయడంతో బాలిక కాళ్లలో కండరాలు దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆగ్రహించిన చిన్నారి తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపల్‌ కు ఫిర్యాదు చేశారు. అయితే తాము కంప్లైంట్ ఇచ్చినా ఆ టీచర్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Chhattisgarh Horror Teacher Forces 8-Year-Old to Do 100 Sit-Ups Leaves Her Unable to Walk

గుంజీలు తీయించడం కారణంగా తమ చిన్నారి నడవలేకపోతోందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ ఘటన రాష్ట్ర విద్యాశాఖ దృష్టికి రావడంతో దర్యాప్తు జరిపించి టీచర్ నమ్రతా గుప్తాను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే ప్రిన్సిపల్ పైనా చర్యలు తీసకున్నట్లు స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+