రేప్‌ను ప్రతిఘటించిన ఆంటీ‌: ఇద్దరు పిల్లలను కాల్చేసిన కామాంధుడు

రాయపూర్: ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో ఓ కామాంధుడు అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. ఓ మహిళ అత్యాచార యత్నాన్ని అడ్డుకుందనే కోపంతో ఇద్దరు పిల్లలను అతను అగ్నికి ఆహుతి చేశాడు. ఛత్తీస్‌గడ్‌లోని దుర్గ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం - ఖాప్రీ గ్రామానికి చెందిన 22 ఏళ్ల మహిళకు నెల రోజుల క్రితం పెళ్లయింది. దీంతో ఆమె గుసిద్ గ్రామంలోని తన ఆడపడుచు ఇంట్లో ఉంటోంది. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సోమవారంనాడు మధ్యాహ్నం ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి ప్రయత్నించాడు.

Chhattisgarh: Man burns children to death after their aunt resists rape

ఆమె అడ్డుకోవడంతో ఆగ్రహించిన ఆ దుండగుడు ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్నారులకు నిప్పంటించాడు. ఈ ఇద్దరు ఆ మహిళ ఆడపడుచు పిల్లలని తెలుస్తోంది. ఈ ఘటనలో చిన్నారులు మోహన్ (3), భువనేశ్వరి (6) అక్కడికక్కడే మరణించారు.

సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని మహావీర్‌గా గుర్తించారు. పిల్లలపై కిరోసిన్ పోసి అతను వారికి నిప్పంటించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+