కర్ణాటక రిజల్ట్స్: ఎమ్మెల్యేల జాబితా గవర్నర్ కు అందించిన ఈసీ
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర గవర్నర్ ను ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి బుధవారం నాడు కలిశారు. రాష్ట్రంలో విజయం సాధించిన అభ్యర్ధుల జాబితాను ఎన్నికల సంఘం అధికారులు గవర్నర్ కు రాజ్ భవన్‌లో అందించారు.
కర్ణాటక రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకు మే 12వ, తేదిన ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బిజెపికి 104 స్ధానాలు కైవసం చేసుకొంది. కాంగ్రెస్ పార్టీ 78 స్థానాల్లో విజయం సాధించింది. జెడి(ఎస్) 38 స్థానాల్లో విజయం సాధించగా, ఇద్దరు స్వతంత్రులు విజయం సాధించారు. అయితే కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బిజెపి, కాంగ్రెస్-జెడి(ఎస్) పార్టీలు ప్రయత్నాలను ప్రారంభించాయి.

రాష్ట్రంలో 222 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకొందనే విషయమై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాష్ట్ర గవర్నర్ విజూభాయ్ వాలాకు జాబితాను సమర్పించారు. రాష్ట్రంలోని ఆయా శాసనసభస్థానాల్లో ఏ పార్టీ అభ్యర్ధి గెలుపొందారనే విషయమై జాబితాను రూపొందించి ఎన్నికల సంఘానికి సమర్పించారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బిజెపి నేత , మాజీ సీఎం యడ్యూరప్ప ధీమాగా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్-జెడి(ఎస్) పార్టీలు కూడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఎమ్మెల్యే సంఖ్య తమకు ఉందని ప్రకటించాయి. ఈ మేరకు తమను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వనించాలని గవర్నర్ ను కోరారు.
ఇదిలా ఉంటే సీఎం పీఠం తనదేననే ధీమా యడ్యూరప్పలో కన్పిస్తోంది. తన ప్రమాణస్వీకారానికి ప్రధానమంత్రి మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వస్తారని కూడ ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications