వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచిన సీఎం సోదరుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

గ్యాంగ్‌టక్: సిక్కింలో ఉప ఎన్నిక జరిగిన రంగాంగ్-యాంగాంగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ సోదరుడు ఆర్ఎస్ చామ్లింగ్ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఎస్‌డీఎఫ్ అభ్యర్థి కుమారి మంగర్ పైన ఆయన 708 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

చామ్లింగ్‌కు 4,788 ఓట్లు రాగా కుమారి మంగర్‌కి 4080 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 351 ఓట్లు మాత్రమే వచ్చాయి. వరుసగా ఐదోసారి గెలుపొంది సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Chief minister’s brother wins Sikkim assembly seat as independent

ముగ్గురు ముఖ్య నేతలకు ఊరట

ఉప ఎన్నికల్లో మూడు పార్టీలకు చెందిన ముఖ్య నేతలకు ఊరట లభించింది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల విజయం సాధించి అత్యున్నత పదవులనధిష్ఠించిన మోడీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాము ఖాళీ చేసిన స్థానాల్లో తమవారిని గెలిపించుకుని సత్తాచాటారు.

సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్‌లోని వడోదర రెండోస్థానంగా పోటీ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, ఆ స్థానంలో రాజీనామా చేయడం తెలిసిందే. అక్కడ జరిగిన ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి రంజన్ భట్ ఘనవిజయం సాధించారు. ఉత్తరప్రదేశ్‌లో మెయిన్‌పురి లోకసభ స్థానంలో బీజేపీ హవాను తట్టుకుని సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి విజయం సాధించింది.

మెదక్ లోకసభ స్థానానికి పోటీ చేసిన కేసీఆర్, అటు ఎమ్మెల్యేగానూ గెలిచారు. తెలంగాణలో తెరాస మెజార్టీ సాధించడంతో కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. దీంతో లోకసభకు రాజీనామా చేశారు. ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.

English summary
Independent candidate RN Chamling won Rangang-Yangang assembly seat by 708 votes defeating his nearest Sikkim Democratic Front (SDF) nominee Kumari Mangar in Sikkim.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X