రిలాక్స్.. పిల్లలపై థర్డ్ వేవ్ ఇంపాక్ట్ ఉండదు, who,aims సర్వే
కరోనా కలవరానికి గురిచేస్తోంది. ఫస్ట్, సెకండ్ వేవ్ తర్వాత.. థర్డ్ వేవ్ అనే వార్తలు వస్తున్నాయి. ఇదీ ముఖ్యంగా పిల్లలపై ప్రభావం చూపనుందని కథనాలు వచ్చాయి. దీంతో పేరంట్స్ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)-ఎయిమ్స్ (ఢిల్లీ) కలిసి చేసిన ఓ అధ్యయనం రిలాక్స్ కలిగించింది.
పిల్లల్లో ఇప్పటికే అధిక సీరోపాజిటివిటీ ఉన్నట్లు గుర్తించింది. మొత్తం ఐదు రాష్ట్రాల్లో 10 వేల మందిపై సీరో సర్వే నిర్వహించారు. ప్రస్తుతం 4,509 మందికి సంబంధించిన ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. వీరిలో 700 మంది 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు కాగా.. 3,809 మంది 18 ఏళ్ల పైబడినవారు. వీరిలో సగటు వయసు ఢిల్లీ అర్బన్‌లో 11 ఏళ్లు, ఢిల్లీ రూరల్‌లో 12 ఏళ్లు, భువనేశ్వర్‌లో 11 ఏళ్లు, గోరఖ్‌పూర్‌లో 13 ఏళ్లు, అగర్తలాలో 14 ఏళ్లుగా ఉంది. మార్చి 15, జూన్ 10 మధ్య నమూనాలు సేకరించారు.

పిల్లల్లో సార్స్-కొవ్-2 సీరో-పాజిటివిటీ ఎక్కువగా ఉందని.. వయోజనులతో పోలిస్తే సమానంగా ఉందని అధ్యయనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏ వేరియంట్ వల్లనైనా భవిష్యత్తులో థర్డ్ వేవ్ వస్తే దాని ప్రభావం పిల్లలపై మాత్రమే అధిక ప్రభావం చూపే అవకాశం లేదని స్పష్టం చేసింది. థర్డ్ వేవ్ అని.. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని అపోహకు గురికావొద్దని స్పష్టంచేసింది.
ఈ అధ్యయనం మనోధైర్యం కలిగిస్తోంది. పిల్లలకు ఏం కాదు అని చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సజెస్ట్ చేస్తున్నారు. కరోనా వల్ల ప్రతీ ఒక్కరు భయాందోళనకు గురవుతున్నారు.












Click it and Unblock the Notifications