• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనావైరస్ కుదిపేసినా చైనా ఆర్ధిక వ్యవస్థ దూసుకుపోవడంలో రహస్యం ఏమిటి

By BBC News తెలుగు
|

చైనా ఆర్ధిక వృద్ధిలో తయారీ రంగానిది కీలకపాత్ర

2020లో ఆర్థిక వృద్ధిని సాధించిన ఏకైక దేశంగా చైనా నిలిచినట్లు తాజాగా విడుదలైన ఆర్ధిక ఫలితాలనుబట్టి తేలింది.

అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే గత ఏడాది ఆర్ధిక రంగంలో 2.3% మెరుగుదలను కనబరిచిన చైనా, చివరి త్రైమాసికంలో 6.5% వృద్ధిని సాధించింది.

కోవిడ్‌-19, లాక్‌డౌన్‌ పరిణామాలతో 2020 మొదటి త్రైమాసికంలో చైనా అర్ధ వ్యవస్థ 6.8% క్షీణతను ఎదుర్కొంది.

అయితే కోవిడ్‌ నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో, వ్యాపార కార్యకలపాలు కొనసాగేలా తక్షణ చర్యలు చేపట్టడంతో ఆర్ధిక వ్యవస్థ కోలుకునే అవకాశం కలిగింది.

చైనా ఎకానమీ వేగాన్ని అందుకుందని కొందరు ఆర్థిక నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.

“ఆర్థిక రంగం కోలుకుని సాధారణ స్థితికి వచ్చిందన్న విషయాన్ని జీడీపీ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి.

కొన్ని రాష్ట్రాలలో ఇంకా కోవిడ్‌-19 ప్రభావం వల్ల హెచ్చుతగ్గులున్నా చైనా ఆర్ధిక రంగంలో ఇదే వేగం కొనసాగే అవకాశం ఉంది’’ అని ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్ యూనిట్‌ (EIU)లో ప్రిన్సిపల్‌ ఎకనమిస్ట్‌గా పని చేస్తున్న యు-సు ఓ ప్రకటనలో వ్యాఖ్యానించారు.

అంతేకాదు ఆర్థికవేత్తలు ఊహించినదానికన్నా చైనా, హాంకాంగ్‌ల షేర్‌మార్కెట్‌లలో లాభాల పంట పండిందని రాయిటర్స్‌ నిర్వహించిన సర్వే వెల్లడించింది.

గ్రాఫ్

వాస్తవానికి తాజా ఆర్ధిక ఫలితాలలో చైనా పురోగతి చూపించినా, కోవిడ్‌ కారణంగా ఆ దేశ వృద్ధిరేటు గత నాలుగు దశాబ్దాలలో అత్యంత తక్కువ వేగాన్ని ప్రదర్శించింది.

చైనా తయారీ రంగం అత్యధిక వృద్ధిని చూపించినట్లు తాజా ఫలితాలలో తేలింది. సోమవారంనాటి ఫలితాలలో మాన్యుఫ్యాక్చరింగ్ రంగం 7.3% వృద్ధి రేటును కనబరిచింది. ఆ దేశ ఎగుమతుల రంగం వాటా కూడా పెద్దదే.

గత డిసెంబర్‌లో చైనా ఎగుమతులు నిపుణులు ఊహించినదానికంటే అధికంగా ఉన్నాయి. కరోనా వైరస్‌ కారణంగా చైనా సరుకులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెరిగినట్లు తేలింది. యువాన్‌ బలపడటంతో విదేశీ కొనుగోలుదారులకు చైనా వస్తువులు ప్రియంగా మారాయి.

కరిష్మా వాస్వాని

దూకుడు మీదున్న చైనా

ఒకపక్క ప్రపంచమంతా ఉద్యోగాల కోత, వ్యాపారాల మూసివేతలతో సతమతమవుతుండగా, చైనా ఆర్ధిక వ్యవస్థ మాత్రం పుంజుకుని దూకుడుగా ముందుకు సాగింది.ఒక్కమాటలో చెప్పాలంటే లాక్‌డౌన్‌ తర్వాత చైనా ఆర్ధిక వ్యవస్థగర్జిస్తూ దూసుకుపోయింది.

కరోనా మహమ్మారి బైటపడిన కొద్ది రోజుల్లోనే చైనా తన దేశంలోని అనేకనగరాలలో లాక్‌డౌన్‌ విధించడం బాగా కలిసొచ్చిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ పెట్టుబడులు, ప్రపంచవ్యాప్తంగా చైనా వస్తువులకుడిమాండ్‌ పెరగడం కూడా ఆర్ధిక వృద్ధికి సహకరించింది.

అయితే చైనాకు ఇప్పటికీ ఇది గత 40సంవత్సరాలతో పోలిస్తే అత్యల్ప వృద్ధిరేటు. వైరస్‌ మళ్లీ విజృంభించే అవకాశం ఉందన్న అంచనాలు, వినియోగదారుల నుంచిడిమాండ్లు తక్కువగా ఉండటంలాంటివి చైనా వృద్ధి రేటుపై మేఘాలు కమ్ముకునేలాచేస్తున్నాయి.

అమెరికాకు రాబోయే కొత్త పాలకులు చైనా విషయంలో డోనల్డ్ ట్రంప్‌కన్నా సాఫ్ట్‌గాఏమీ వ్యవహరించబోరన్న అంచనాల మధ్య ఆ దేశంలో వ్యాపార సంబంధాల కోసం చైనా ప్రయత్నాలుచేస్తూనే ఉంది.

2021లో చైనా ఆర్ధిక వృద్ధి మీద పలు సవాళ్లు ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ, ప్రపంచంలోని అనేక భారీ ఆర్ధిక వ్యవస్థలతో పోలిస్తే చైనా పరిస్థితి స్థిరంగా, సానుకూలంగాఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

అమెరికా ఎలా వ్యవహరించబోతోంది?

దీంతోనే చైనా సంతోషించే పరిస్థితి కూడా లేదు. కొన్ని రంగాలలో స్తబ్ధత రాబోయే రోజుల్లో ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపవచ్చని స్టాండర్డ్‌ చార్టర్డ్ బ్యాంక్‌ సీనియర్‌ ఎకనామిస్ట్‌ లీ వెయ్‌ అన్నారు.

“దేశీయంగా గృహ అవసరాల వినియోగం మహమ్మారికి ముందున్న పరిస్థితులకన్నా తక్కువ స్థాయిలోనే ఉంది. ప్రయాణాలపై నిబంధనల కారణంగా రవాణా, హోటల్‌ రంగాలు ఇంకా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉన్నాయి’’ అని లీ వెయ్‌ రాయిటర్స్‌తో అన్నారు.

యువాన్‌ విలువ పెరగడంతో ఎగుమతుల నుంచి రాబడి పెరిగింది

2020 చివరి త్రైమాసికంనాటికి రిటైల్‌ సేల్స్‌లో 4.6% వృద్ధి కనిపించింది. అయితే వార్షికంగా చూస్తే అవి 3.9% పడిపోయాయి.

2021లో చైనా ఆర్ధికరంగం మరింత వృద్ధిని సాధిస్తుందని అంచనా వేస్తున్నా, రాబోయే రోజుల్లో కరోనా మహమ్మారి దేశీయంగా, అంతర్జాతీయంగా తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని చైనా బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ హెచ్చరించింది.

అమెరికాతో వ్యాపార సంబంధాలు సరిగా లేకపోవడం, రాబోయే రోజుల్లో బైడెన్‌ ఎలా వ్యవహరిస్తారన్న అంశాలు ఆ దేశ ఆర్ధిక వృద్ధిరేటుపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
China economy back on track
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X