వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా-తైవాన్ ఘర్షణ: ఒకప్పుడు లౌడ్ స్పీకర్లలో పాటలు వినిపించి పరస్పరం హింసించుకున్న రెండుదేశాలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
1967లో తైవాన్ నిర్మించిన లౌడ్ స్పీకర్ వాల్

పగలు, రాత్రి, ఉదయం, సాయంత్రం అన్న తేడా లేకుండా నిరంతరం సంగీతం, అది కూడా భారీ సౌండ్‌తో వినాల్సి వచ్చిందనుకోండి. ఆ అనుభవం ఎలా ఉంటుంది? నిజంగా హింసే కదా.

మరి, ఆ సౌండ్ హింసను ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు...దశాబ్దాల పాటు భరించడం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇది మీకు వింతగా అనిపించవచ్చు, కానీ తైవాన్ ఈ ప్రయోగాన్ని చైనా మీద చేసింది.

కుమోయి ద్వీపం నుండి ప్రచార యుద్ధంలో కమ్యూనిస్ట్ చైనాకు వ్యతిరేకంగా తైవాన్ ప్రభుత్వం ఈ వ్యూహాన్ని అనుసరించింది.

ప్రతిరోజూ, 24 గంటలుపాటు, మానసిక యుద్ధం సాగేది. ఇలా రెండు దశాబ్దాలకు పైగా ఈ వ్యూహం నడిచింది.

చైనా ప్రధాన భూభాగం వైపు పది మీటర్ల ఎత్తయిన గోడకు లౌడ్ స్పీకర్‌లను ఏర్పాటు చేశారు. ఈ గోడనే బేషన్ బ్రాడ్‌కాస్ట్ వాల్ అని పిలుస్తారు.

ఈ లౌడ్ స్పీకర్ల నుంచి తైవానీస్ భాషలో నిరంతరం పాటలు ప్లే చేశారు. పాటలు కాకపోతే, చైనా సైనికులకు మీ పద్ధతి మార్చుకోవాలంటూ సందేశాలు వినిపించేవారు.

ఒక బలమైన కాంక్రీట్ గోడ నిర్మించి, దానికి 48 అతి పెద్ద లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేశారు. ఈ లౌడ్ స్పీకర్ల నుంచి వచ్చే శబ్ధాలు భీకరంగా ఉండేవి. ఇవి దాదాపు 25 కిలోమీటర్ల దూరం వరకు ఈ వినిపించేవి.

ఇది ఒక రకమైన మానసిక యుద్ధం. ఇది రెండు తీరాలలోని ప్రజలను ఇబ్బంది పెట్టింది. ఈ మానసిక యుద్ధం 1979లో కమ్యూనిస్ట్ చైనాను అమెరికా గుర్తించిన తర్వాత, అక్కడి పరిస్థితులతో మార్పులు రావడంతో ముగిసింది.

కుమోయి బీచ్

రెండు దశాబ్దాల పాటు బాంబుల మోత

తైవాన్ అనేక చిన్న ద్వీప సమూహాలతో ఏర్పడిన ద్వీపం. చైనా తీరానికి 10 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉంది. ఈ ద్వీపం అంతా తైవాన్ సార్వభౌమాధికారం కిందకు వస్తుంది.

1949లో, షాంగ్ కై షేక్ జాతీయవాద దళాలను మావో జెడాంగ్ నాయకత్వంలోని కమ్యూనిస్టులు బహిష్కరించారు. అప్పటి నుంచి తైవాన్ ఆయన ఆధీనంలో ఉంది.

అదే సంవత్సరంలో ఈ ద్వీప తీరంలో భీకర యుద్ధం జరిగింది. ఇందులో కమ్యూనిస్ట్ దళాలు తైవాన్‌ను ఆక్రమించకుండా నిరోధించడంలో కోమింటాంగ్ విజయం సాధించింది. అప్పట్లో ఏర్పడిన భౌగోళిక పరిస్థితి నేటికీ అలాగే ఉంది.

అయితే, 1954, 1958లో తైవాన్-స్ట్రెయిట్స్ సంక్షోభం సమయంలో, ఈ ద్వీపం జాతీయవాదులు, కమ్యూనిస్టుల మధ్య మరో కొత్త సంఘర్షణకు కారణమైంది.

ఈ రెండో సంఘర్షణ తరువాత, చైనా, తైవాన్‌లు రెండు దశాబ్దాల పాటు రోజు మార్చి రోజు బాంబులు వేసుకున్నాయి. కమ్యూనిస్టులు బేసి రోజుల్లో, జాతీయవాదులు సరి రోజుల్లో బాంబులు వేసేవారు.

ప్రచార యుద్ధం

ఒకపక్క సైనికుల దాడులతో యుద్ధ సామాగ్రి దెబ్బతినడం, సైనికుల మరణాలు కొనసాగుతుండగానే, మరోవైపు కరపత్రాల యుద్ధం కూడా సాగేది. బాంబుల ద్వారా కరపత్రాలు ఇరు దేశాల భూభాగాలతో కనిపిస్తుండేవి. ఇందులో కరపత్రాలతోపాటు, రకరకాల ఫొటోలు కూడా ఉండేవి.

కొన్ని ఫొటోలలో షాంగ్‌కై షేక్ నవ్వుతూ కనిపించేవారు. కొన్నిసార్లు చైనా సైనికులు నడుస్తూ వెళుతున్న ఫొటోలు, మరికొన్నిసార్లు చైనా యువతులు తైవాన్ యువకులను పెళ్లి చేసుకున్నట్లు నిరూపించే డాక్యుమెంట్లు కూడా ఉండేవి.

ఈ ప్రచార యుద్ధం విస్తృతంగా మారింది. కొన్నిసార్లు వీటిలో సబ్బుపెట్టెలు, కొన్నిసార్లు బెలూన్‌లు వంటి చిన్న బహుమతులు ఉండేవి. మరికొన్నిసార్లు బీర్ సీసాలను చైనా మెయిన్ లాండ్ వైపు వెళ్లేలా నీటిలో వదిలేవారు. అలాగే రేడియోల ద్వారా తైవాన్ వైపు నుంచి ప్రచారం చేయడానికి ప్రయత్నాలు జరిగేవి.

ఇవన్నీ ఒక ఎత్తయితే, 1967వ సంవత్సరంలో అందుబాటులోకి వచ్చిన కొత్త సాధనం మరొక ఎత్తు. ఇది తైవాన్ కనిపెట్టిన అత్యంత మధురమైన ఆయుధం. ఈ ఆయుధం నుంచి సంగీతం వెలువడుతుంది.

తైవాన్ జలసంధికి ఇరువైపులా

థెరెసా టెంగ్ సుప్రసిద్ధ గాయని. ఆమెను 'ది ఎటర్నల్ క్వీన్ ఆఫ్ ఏషియన్ పాప్' అని కూడా పిలుస్తారు. ఈ తైవాన్ జలసంధికి రెండు వైపులా ఉన్న ప్రజలకు టెంగ్ సుపరిచితురాలు. అంతేకాదు, ఆమె కమ్యూనిస్ట్ నాయకుడు డెంగ్ జియావోపింగ్‌కు ఇష్టమైన గాయని కూడా.

తైవాన్ చైనా మీద ప్రయోగించిన లౌడ్ స్పీకర్ల యుద్ధంలో ఎక్కువగా వినిపించిన పాటలు ఎవరివి అంటే అవి థెరాస టెంగ్ వే. ఆమె అనేకసార్లు తైవాన్ ద్వీపానికి వెళ్లారు. పలుమార్లు ఆ భారీ లౌడ్-స్పీకర్ల ద్వారా ఆమె ప్రజలకు సందేశాలిచ్చారు.

1990లలో చైనాకు సందేశాలు, సంగీతాన్ని ప్రసారం చేసే యుద్ధాన్ని కొనసాగించడానికి కోమోయ్ దీవులలో మరో నాలుగు రిలే స్టేషన్‌లు నిర్మించారు.

తైవాన్ జలసంధి సమిపంలోని యుద్ధ శకలాలు

సాంకేతికత వినియోగం

తైవాన్‌కు అనేక వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ కొరియాకూడా ఇదే తరహా సాంకేతికతను 2018 వరకు ఉపయోగించింది.

తన శత్రువులైన ఉత్తర కొరియన్లను వేధించడానికి, పీడించడానికి, తన ప్రచార సందేశాలను వ్యాప్తి చేయడానికి, దక్షిణ కొరియా కె-పాప్ పాటలతో పాటు, విభిన్న సందేశాలను వినిపించేది.

అయితే, తర్వాత కమ్యూనిస్టులు కూడా అదే వ్యూహాన్ని అనుసరించి స్పందించారు.

చైనా మీద తైవాన్ సాగించిన ఈ సౌండ్ యుద్ధం ప్రజలకు శాపంగా మారింది. ఈ వ్యూహం అక్కడ నివసించే ప్రజల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది.

ప్రశాంతమైన ప్రదేశంలో ఉండగలగడం ఒక విలాసంగా మారింది.

ఇటు చైనా కూడా ఈ లౌడ్ స్పీకర్ వార్‌‌ను మొదలు పెట్టడంతో తైవాన్ ద్వీపంలోని ప్రజల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

ప్రస్తుతం పర్యాటక ప్రదేశం

చైనా నుంచి వచ్చిన శబ్ధాలు గర్జనలాగా ఉండేవని లింగ్ మా-టెంగ్ బీబీసీ కల్చర్‌తో అన్నారు. ఆయన యుద్ధ సమయంలో తైవాన్ మిలిటరీలో పని చేశారు.

''ఆ గర్జన నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఆ సంగీతం నిరంతరాయంగా ప్లే అవుతూ ఉండేది. దాన్ని వినీవినీ మేం అలసిపోయాం'' అని ఆయన అన్నారు.

ఈ మానసిక యుద్ధం 1990 సంవత్సరం వరకు కొనసాగింది. నేటికీ చాలా మంది పర్యాటకులు వీటిని సందర్శించడానికి వస్తారు.

ఇప్పటికీ అక్కడ పాటలు, సందేశాలు వినిపిస్తూ ఉంటాయి. కాకపోతే, ఇప్పుడు చాలా తక్కువ సౌండ్‌తో. ఈ లౌడ్ స్పీకర్లను చూసి, విని పర్యాటకులు ఆనందిస్తుంటారు.

ఈ స్పీకర్లను చూడటానికి వచ్చేవారిలో ఎక్కువగా చైనీస్ పర్యాటకులే ఉంటారు. తైవాన్ ద్వీపం ఇప్పటికీ థెరెసా టెంగ్ మధురమైన స్వరంతో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
China-Taiwan Clash: Two Countries That Once Tortured Each Other Over Loud Speakers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X