వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బోర్డర్ టెన్షన్స్ : సంచలన వీడియో విడుదల చేసిన చైనీస్ మీడియా.. యుద్ద సంకేతాలు?

|
Google Oneindia TeluguNews

భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు ఏ క్షణాన తీవ్రరూపం దాల్చి యుద్దానికి దారితీస్తాయోనన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల మిలటరీ కమాండర్స్ సానుకూల వాతావరణంలో చర్చలు జరిపాక కూడా.. సరిహద్దు వెంబడి చైనా దూకుడుకు తెరపడట్లేదు. తాజాగా తూర్పు లదాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా తమ బలగాలను పెద్ద ఎత్తున మోహరించింది. దీనికి సంబంధించి చైనీస్ మీడియా ఓ వీడియోను విడుదల చేయగా.. యుద్దానికి సన్నద్దమవుతున్నారా అన్న రీతిలో ఉన్న ఆ దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఏముందా వీడియోలో..

చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ అనే మీడియా తమ ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేసింది. 'పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)కి చెందిన వేలాది మంది సైనికులు,పీఎల్ఏ వైమానిక దళాన్ని హుబెయ్ ప్రావిన్స్ నుంచి వాయువ్య ప్రాంతంలోని ఎత్తైన ప్రాంతానికి చైనా తరలించింది.' అని పేర్కొంది. సరిహద్దులో రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. ఈ ప్రక్రియ మొత్తాన్ని కొద్ది గంటల్లోనే చైనా పూర్తి చేసినట్టు పేర్కొంది.భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా ఇలా సైనికులను మోహరించడం ఉద్రిక్తతలను మరింత పెంచేదిగా మారింది.

వివాదం కొత్తదేమీ కాదు..

వివాదం కొత్తదేమీ కాదు..


భారత్-చైనా సరిహద్దు వివాదం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అంతుచిక్కడం లేదు. కరోనా వైరస్ వ్యాప్తికి కారణమై ప్రపంచ దేశాల చేత విమర్శలు ఎదుర్కొంటున్న చైనా.. దాని నుంచి దృష్టి మరలించేందుకే భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాతో భారత్ మిత్రుత్వాన్ని ప్రభావితం చేయడమే లక్ష్యంగా చైనా ఈ చర్యలకు పూనుకుంటుందన్న విశ్లేషణలు కూడా వ్యక్తమవుతున్నాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో అమెరికా తన పూర్వ వైభవాన్ని కోల్పోతే... ఆ స్థానాన్ని తాము దక్కించుకోవాలని కలలు గంటున్న చైనా.. ముందుగా ఆసియాలోని పొరుగు దేశాలను తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని భావిస్తోందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

Recommended Video

India China border standoff Latest news
చర్చలు జరిగాక కూడా..

చర్చలు జరిగాక కూడా..

లదాఖ్ ప్రాంతంలో సరిహద్దు ఉద్రిక్తతలు కొత్తేమీ కావు. గత ఐదేళ్లుగా ఇరు దేశాల మధ్య వివాదాలు,ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. సరిహద్దు భూభాగంలో రోడ్డు నిర్మాణాలు వంటివి చేపట్టినప్పుడు ఈ ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతుంటాయి. ప్రస్తుతం కూడా ఇదే జరుగుతోంది. దీనిపై సామరస్యపూర్వకంగా చర్చించేందుకు జూన్ 6న ఇరు దేశాల మిలటరీ కమాండర్స్ సమావేశమైన సంగతి తెలిసిందే. గాల్వాన్‌ లోయ, పాంగాంగ్‌ సరస్సు వద్ద యదాతథస్థితిని నెలకొల్పాలని భారత్ చైనాను డిమాండ్ చేసింది. అలాగే ఎల్‌ఏసీలోని భారత్ వైపునున్న ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అడ్డు తగలవద్దని కోరింది. భారత్ తరఫున లేహ్‌ 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్‌ జనరల్‌ హరీందర్‌ సింగ్‌, చైనా తరుపున కమాండర్‌ లియు లిన్ ఈ చర్చలు జరిపారు.

English summary
A day after military commanders of the India and China met to deliberate on the ongoing standoff in Ladakh, the Chinese Army released a video on Sunday showing thousands of soldiers engaging in an exercise on the Indo-China border.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X