శశికళ‘టాక్ ఆఫ్ కంట్రీ’:గవర్నర్ కూడా బయటే, అందుకే ?

అన్నాడీఎంకే పార్టీ గుర్తు రెండాకులు. ఇంత కాలం రెండాకుల మీద ఒక పక్క జయలలిత, మరో పక్క శశికళ వెలుగుతూ వచ్చారు. ఇప్పుడు ఒక ఆకు (జయలలిత) కిందకు రాలిపోయింది.

చెన్నై: ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) చీఫ్ గా భాద్యతలు స్వీకరించడానికి సిద్దం అవుతున్న చిన్నమ్మ నెచ్చెలి శశికళ కథ చిన్నదేమీకాదు. ఎక్కడో జన్మించి మద్రాసు (చెన్నై) చేరుకున్న శశికళ జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. శశికళ ప్రయాణం ఈ నాటిది కాదు.

అన్నాడీఎంకే పార్టీ గుర్తు రెండాకులు. ఇంత కాలం రెండాకుల మీద ఒక పక్క జయలలిత, మరో పక్క శశికళ వెలుగుతూ వచ్చారు. ఇప్పుడు ఒక ఆకు (జయలలిత) కిందకు రాలిపోయింది. ఉన్న మరో ఆకు (శశికళ) ఇప్పుడు రెపరెపలాడటానికి సిద్దం అయ్యింది.

జయలలిత ఇప్పుడు టాక్ ఆఫ్ కంట్రీగా మారిపోయారు. పార్టీకి పెద్దగా ఉండాలని అందరూ ఆమె కాళ్ల మీదపడి వేడుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ? అర్థం అవుతుంది. గవర్నర్, కేంద్ర మంత్రులు, పార్టీ ప్రముఖులు సైతం జయలలితను అపోలో ఆసుపత్రిలో పరామర్శించడానికి అవకాశం చిక్కకపోవడంతో వారు వెనుతిరిగారు.

 Chinnammaa Sasikala to become the General Secretary of AIADMK

వైద్యులు మినహా జయలలితను నేరుగా కలుసుకున్న ఏకైక వ్యక్తి శశికళ. అంటే వారిద్దర మద్య ఉన్న అనుబంధం అలాంటిది అని అన్నాడీఎంకే పార్టీ నాయకులు అంటున్నారు. మీడియాకు కూడా జయ ఆసుపత్రిలో ఉన్న సమయంలో కనీసం ఒక్క ఫోటో చిక్కనివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జయ శశికళ అనుబంధం అలాంటిది మరి.

ఇప్పుడు జయలలలిత తరువాత మీరే దిక్కు తల్లి అంటూ శశికళ కాళ్ల మీద ఎందుకు పడుతున్నారు ? పార్టీలో ఆమెకు ఉన్న పట్టు ఏమిటీ ? రాజకీయాల్లో శశికళకు ఎలాంటి అనుభవం ఉంది ? తమిళనాడులో వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే పరిస్థితి ఏమిటీ ? అనే ప్రశ్నలు మొదలైనాయి.

మరో వైపు ప్రత్యర్థి పార్టీ డీఎంకే చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి (92), ఆయన కుమారుడు స్టాలిన్ ను తట్టుకుని వీరు ఎన్నికల్లో పోరాటం చేస్తారా ? మళ్లీ అధికారంలోకి వస్తారా ? అమ్మ జయలలిత లేని లోటును తీరుస్తారా ? తదితర ప్రశ్నలకు అన్నాడీఎంకే నాయకులు పార్టీ కార్యకర్తలకు, తమిళనాడు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+