రెబల్ లీడర్ జంప్, ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటిలో ఎన్నికల అధికారులు సోదాలు !
బెంగళూరు/చిత్రదుర్గ: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైయ్యింది. పలు ప్రాంతాల్లో ఓటు వెయ్యడానికి ప్రజలు ఆసక్తి చూపించగా పలు ప్రాంతాల్లో నీరసంగా ఓటింగ్ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల ముందు జేడీఎస్ పార్టీ అభ్యర్థి ఇంటిలో ఎన్నికల అధికారులు సోదాలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
కర్ణాటకలోని చిత్రదుర్గ పట్టణ జేడీఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ రఘు ఆచార్ పోటీ చేస్తున్నారు. చిత్రదుర్గ తాలుకాలోని క్యాదిగెరె గ్రామంలోని జేడీఎస్ పార్టీ అభ్యర్థి రఘు ఆచార్ ఇంటిలోకి మంగళవారం రాత్రి ఎన్నికల అధికారులు ఎంట్రీ ఇచ్చారు. జేడీఎస్ పార్టీ అభ్యర్థి రఘు ఆచార్ ఇంటిలో ఎన్నికల అధికారులు సోదాలు చెయ్యడం కలకలం రేపింది.

కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ సీనియర్ నాయకుడు అయిన రఘు ఆచార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశించారు. అయితే టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా రోజులు ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. రఘు ఆచార్ మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో చాలా వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు తెలిసింది.
చిత్రదుర్గ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మాజీ ఎమ్మెల్సీ రఘు ఆచార్ కు టిక్కెట్ ఇవ్వకుండా ఆలస్యం చేసిన కాంగ్రెస్ పార్టీ లీడర్స్ వారి లెక్కలు వారు వేసుకుని చివరికి కేసీ. వీరేంద్రకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చింది. తనకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వలేదని ఊగిపోయిన మాజీ ఎమ్మెల్సీ రఘు ఆచార్ వెంటనే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా జేడీఎస్ పార్టీలో చేరిపోయారు.
జేడీఎస్ పార్టీలో చేరిన వెంటనే ఆ పార్టీ టిక్కెట్ సంపాధించుకున్న రఘు ఆచార్ చిత్రదుర్గాలో ఎన్నికల ప్రచారం చేస్తూ ఓటర్లను వివిద రకాలుగా ఆకర్షించడం మొదలుపెట్టారు. చిత్రదుర్గాలో తనదే విజయం అంటూ జేడీఎస్ పార్టీ అభ్యర్థి రఘు ఆచార్ ధీమాగా ఇంతకాలం ఎన్నికల ప్రచారం చేశారు.
అయితే రఘు ఆచార్ మీద అనేక ఫిర్యాదులు అందడంతో చివరికి ఎన్నికల అధికారులే ఆయన ఇంటిలోకి ఎంట్రీ ఇచ్చారు. చిత్రదుర్గ జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘు ఆచార్ ఇంటిలో ఏమి స్వాధీనం చేసుకున్నారు ? అనే విషయంలో ఎన్నికల అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఓటర్లను మభ్యపెట్టడానికి రఘు ఆచార్ ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications