వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతీకార దాడికి తేదీ, సమయం నిర్ణయించుకోండి .. పుల్వామా దాడిపై భద్రతా దళాలతో మోదీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడితో యావత్ భారత్ అట్టుడికిపోతోంది. ఉగ్ర మూకల పిరికిపంద దాడిని ముక్తకంఠంతో ఖండిస్తోంది. దెబ్బకు దెబ్బ అన్నట్టు ప్రతీకార దాడికి సిద్ధం కావాలని భద్రతా సిబ్బందికి ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

ధీటుగా జవాబు ..?

ధీటుగా జవాబు ..?

పుల్వామా దాడిలో నెలకొరిగిన వీరుల మరణం వ్రుథా కాబోదన్నారు ప్రధాని మోదీ. మన వీర సైనికుల ప్రాణం, త్యాగం ఎన్నిటికీ వ్రుథా కాదు. సైనికుల వీరశౌర్యం మన దేశ రక్షణకు సాక్ష్యం, వారి సేవలపై ఎవరికీ ఎలాంటి సందేహం లేదని స్పష్టంచేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ప్రాంతంలో గల ఝాన్సీలో రక్షణశాఖ కారిడార్ కు శంకుస్థాపన చేసి .. మీడియాతో మాట్లాడారు.

డేట్, ప్లేస్, టైం డిసైడ్ చేయండి

డేట్, ప్లేస్, టైం డిసైడ్ చేయండి

పుల్వామాకు సమాధానం చెప్పేందుకు సిద్ధం కావాలని భద్రతా దళాలకు పిలుపునిచ్చారు మోదీ. ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు మీకు అధికారం ఇస్తున్నా, మీరు సమయం, ప్రాంతం, భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకోండి‘ అని మోదీ స్పష్టంచేశారు. ఉగ్రవాదుల దాష్టీకానికి అంతకంతకూ ప్రతీకారం తీర్చుకుంటామని ఉద్ఘాటించారు.

ఇది మంచి పద్దతి కాదు

ఇది మంచి పద్దతి కాదు

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్థాన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మోదీ. పాక్ వైఖరి వల్లే ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారని మండిపడ్డారు. పాకిస్థాన్ వైఖరి వల్ల ఆ దేశానికి ప్రపంచ దేశాలు సహకరించే పరిస్థితి లేదన్నారు. పాకిస్థాన్ ఆర్థికమాంద్యం ఏర్పడి ఆర్థికంగా వెనుకబడ్డాక .. ఆదుకోవడానికి భారత్ సహా ఏ దేశం ముందుకురాదని స్పష్టంచేశారు.

పాక్ పై ప్రపంచదేశాల గుర్రు ..

పాక్ పై ప్రపంచదేశాల గుర్రు ..

పుల్వామాలో ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయని చెప్పారు ప్రధాని మోదీ. తమ దాయాది దేశానికి తప్పకుండా మంచి గుణపాఠం చెబుతాని స్పష్టంచేశారు. ఉగ్రదాడిపై యావత్ ప్రపంచం పాకిస్థాన్ వైఖరిపై గుర్రుతో ఉన్నదనే విషయాన్ని గుర్తుచేశారు.

English summary
Prime Minister Narendra Modi said the sacrifice of the CRPF jawans slain in the Pulwama terror attacks will not go in vain. He said this is the message he wants to give to the people of India. "Our brave soldiers have sacrificed their lives and these sacrifices will not go in vain. The valour of our security forces has been witnessed by the country and there can be no one in our country who doubts their valour and bravery" the prime minister said. He was speaking at the foundation stone-laying of the proposed defence corridor in Uttar Pradesh's Bundelkhand region in Jhansi. Prime Minister Modi said the Indian armed forces have been given free rein to retaliate against the perpetrators of the attack. "Permission granted to forces to decide on time and place for future action against terrorists", the PM said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X