Vishal: దూసుకొచ్చిన ట్రక్కు.. చావుకు అంగుళాల దూరంలో.! (వీడియో)
చెన్నై: ప్రముఖ సినీనటుడు విశాల్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. విశాల్ హీరోగా దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో 'మార్క్ ఆంటోనీ' చిత్రం రూపొందుతోంది. అయితే, ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాన్ని చెన్నైలో చిత్రీకరిస్తుండగా.. ప్రమాదం చోటు చేసుకుంది.
ఫైట్ సీన్‌లో భాగంగా విశాల్ నేలపై పడిపోగా.. అదే సమయంలో వెనుక నుంచి ఓ భారీ ట్రక్కు వేగంగా ఆయన పక్కనుంచి దూసుకెళ్లింది. అక్కడున్నవారందరూ పక్కకు పరుగులు పెట్టారు. విశాల్ వైపు ఆ ట్రక్కు వచ్చివుంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. ట్రక్కు దూసుకురావడంతో కొందరికి స్వల్ప గాయాలైనట్లు తెలిసింది.

ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.. ప్రమాద దృశ్యాలను విశాల్, చిత్ర యూనిట్ పంచుకుంది. తాను కొద్దిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డానని విశాల్ ట్విట్టర్ వేదికగా ఆ వీడియోను షేర్ చేశారు. దేవుడి దయ వల్ల ప్రాణాలతో బయటపడ్డానని పేర్కొన్నాడు.
ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలంటూ అభిమానులు, నెటిజన్లు విశాల్‌కు సూచిస్తున్నారు. కాగా, డూప్ లేకుండా ఫైట్ సీన్లను చేసి పలుమార్లు విశాల్ గాయపడిన విషయం తెలిసిందే.
Jus missed my life in a matter of few seconds and few inches, Thanks to the Almighty
— Vishal (@VishalKOfficial) February 22, 2023
Numb to this incident back on my feet and back to shoot, GB pic.twitter.com/bL7sbc9dOu
కాగా, 'సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. త్వరలోనే తిరిగి షూటింగ్ ప్రారంభిస్తాం' అని తెలిపింది చిత్ర యూనిట్.












Click it and Unblock the Notifications