అయోధ్య విమానాశ్రయాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న కేంద్ర బలగాలు
Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రామ మందిరం ప్రారంభోత్సవం గడువు సమీపించింది. జనవరి 22వ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఈ నెల 15వ తేదీన పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 4,000 వేలమంది ప్రముఖులు హాజరు కానున్నారు. ఇప్పటికే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్.. ఆహ్వానపత్రికలను అందిస్తోంది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ నటీనటులు, సెలెబ్రిటీలకు ఆహ్వానం అందింది. అయోధ్యలో ప్రతి ఇంటికీ రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలు అందాయి.

ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అయోధ్య జిల్లా అధికార, పోలీసు యాంత్రంగం రోజూ సమీక్ష సమావేశాలను నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా రామమందిరం నిర్మాణ పనులను పరిశీలించారు. శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు.
ఈ నెల 15వ తేదీ నాడే రాములోరి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఆరంభమౌతాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్సవంగా దీన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ జరుపుకొనే రామ్ లల్లా విగ్రహాల నిర్మాణం సైతం పూర్తయింది. శ్రీ ఆంజనేయ, లక్ష్మణ సమేత సీతారామచంద్రులవారి విగ్రహాలు అవి.
దేశం నలుమూలల నుంచి అయోధ్యకు చేరుకోవడానికి ప్రత్యేక రైళ్లను నడిపించనుంది కేంద్ర ప్రభుత్వం. విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని అయోధ్యలో ప్రత్యేకంగా విమానాశ్రయం నిర్మితమైన విషయం తెలిసిందే. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దీన్ని ప్రారంభించారు.

మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంగా దీనికి పేరు పెట్టింది కేంద్రం. ఈ విమానాశ్రయాన్ని కేంద్రీయ పారిశ్రామిక భద్రత బలగాలు తమ ఆధీనంలో తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో సెక్యూరిటీ కార్యకలాపాలను సీఐఎస్ఎఫ్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా అయోధ్య ఎయిర్‌పోర్ట్‌ను కూడా సీఐఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. తొలి విడతలో 250 మంది సిబ్బందిని అక్కడ మోహరింపజేస్తారు. ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచీ అక్కడి భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తారు. అదనపు భద్రత సిబ్బందిని నియమిస్తారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications