ముకేష్ అంబానీ నివాసం వద్ద తుపాకీతో కాల్చుకుని సీఐఎస్ఎఫ్ జవాను ఆత్మహత్య
ముంబై: విధి నిర్వహణలో ఉన్న ఓ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) జవాను తన తుపాకీతో తనని తాను కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ మేరకు ఉన్నతాధికారులు తెలిపారు.
దక్షిణ ముంబైలోని భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ నివాసం అంటిలియా వద్ద విధులు నిర్వహిస్తున్నారు ఈ జవాను. ఈ క్రమంలో బుధవారం అతడు తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ముంబై నగరంలోని జేజే ఆస్పత్రిలో ఆ జవాను మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు గురువారం పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications