అవినీతిని భరించలేక యువ ఇంజనీర్ ఆత్మహత్య

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సురేష్ (24) ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మరణించాడు. ఈ పథకంలో పేరుకుపోయిన అవినీతిని సురేష్ భరించలేకపోయాడని, దొంగ బిల్లులు సృష్టించడానికీ వాటిని ఆమోదించడానికీ నిరాకరించి పై నుంచి ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు అతని తండ్రి మారిస్వామి శెట్టి తెలిపారు.
కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో గల కాగలవాడి గ్రామంలో సురేష్ పనిచేస్తున్నాడు. గ్రామ పంచాయతీ సర్పంచ్ సర్దార్, అతడి భార్య సరోజ, స్థానిక ప్రాజెక్టు అధఇకారి (పిడివో) వైరముడి కలిసి దొంగ బిల్లులు ఆమోదించాలని సురేష్‌పై విపరీతంగా ఒత్తిడి తెచ్చారని తల్లిదండ్రులు ఆరోపించారు.
సురేష్ అందుకు నిరాకరించడంతో పాటు, వాళ్లు ఇవ్వజూపిన లంచాన్ని కూడా తిరస్కరించాడు. పైనుంచి కూడా అతనిపై ఒత్తిడి రావడంతో ఆ అవినీతిని భరించలేనంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 90 శాతం కాలి గాయాలతో ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మరమించాడు.












Click it and Unblock the Notifications