సుప్రీంకోర్టు పేరుతో ఫేక్ వెబ్ సైట్-లాయర్లు, పిటిషనర్లకు సీజేఐ హెచ్చరిక..

దేశవ్యాప్తంగా ఫేక్ కల్చర్ పెరిగిపోతోంది. అన్ని రంగాల్లోనూ నకిలీల ప్రభావం ఎక్కువవుతోంది. ఇది ఇప్పుడు న్యాయవ్యవస్ధనూ వదలడం లేదు. ఇదే క్రమంలో తాజాగా ఏకంగా సుప్రీంకోర్టు పేరుతోనే ఓ నకిలీ వెబ్ సైట్ పుట్టుకొచ్చింది. అలాగే దీని లింక్స్ కూడా న్యాయవాదులు, జడ్జీల గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. వీటిని తెలియక క్లిక్ చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇవాళ కీలక హెచ్చరికలు చేశారు.

సుప్రీంకోర్టు పేరుతో www.sci.gov.in డొమైన్ తో ఓ వెబ్ సైట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందని, దీనిపై లాయర్లు, పిటిషనర్లు అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇవాళ సూచించారు. ఈ వెబ్ సైట్ పేరుతో ఏవైనా లింక్స్ వస్తే వాటిని క్లిక్ చేసే ముందు అసలు వెబ్ సైట్ ను సరి చూసుకోవాలని కూడా కోరారు. అదే సమయంలో ఇప్పటికే ఈ లింక్స్ ను క్లిక్ చేసి మోసపోయినట్లయితే ఏం చేయాలో కూడా సూచించారు.

cji dy chandrachud

సుప్రీంకోర్టు పేరుతో క్రియేట్ చేసిన నకిలీ వెబ్ సైట్ పై సుప్రీంకోర్టు రిజిస్ట్రీ స్పందించి పబ్లిక్ నోటీసు జారీ చేసింది. ఈ ఫేక్ వెబ్ సైట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అందరినీ కోరింది. ఇప్పటికే దీనిపై దర్యాప్తు సంస్ధలకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. అయితే ఇప్పటికే ఈ వెబ్ సైట్ లింక్స్ పై క్లిక్ చేసి సైబర్ దాడికి గురైతే మాత్రం వెంటనే తమ ఆన్ లైన్ ఖాతాలు, బ్యాంక్ అకౌంట్ల పాస్ వర్డ్ లు మార్చుకోవాలని లాయర్లు, పిటిషనర్లకు సూచించింది.

సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తమ నోటీసులో మరికొన్ని సూచనలు కూడా చేసింది. వీటిలో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా పేరుతో ఓ నకిలీ వెబ్ సైట్ సృష్టించారని, రెండు యూఆర్ఎల్ లు కూడా జనరేట్ చేశారని తెలిపింది. వీటి ద్వారా రహస్య సమాచారం సేకరిస్తున్నట్లు వెల్లడించింది. కాబట్టి వీటిని ఎవరూ షేర్ చేయొద్దని కోరింది. అలాగే రహస్య సమాచారం కూడా పంచుకోవద్దని తెలిపింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఎప్పుడూ ప్రజల నుంచి లహస్య సమాచారం కోరదని, ఆర్ధిక లావాదేవీలు కూడా అడగదని వెల్లడించింది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరింది.య

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+