నన్ను ఉరితీయండి.. పోలీసులపై సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే ఫైర్!
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా, ఇటీవల ఢిల్లీ పోలీసుల అరెస్టులను నిరసిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ తిరంగా మార్చ్‌ను తలపెట్టింది. ఈ తిరంగా మార్చ్ ఢిల్లీలో ఉద్రిక్తతలను దారితీసింది. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా ఈ యాత్రను చేపట్టవద్దంటూ కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజీత్ దీప్కే నివాసానికి శుక్రవారం ఢిల్లీ పోలీసులు చేరుకుని నోటీసులు జారీ చేశారు. తిరంగా మార్చ్‌కు ముందు పోలీసులు తనను అదుపులోకి తీసుకుంటారని అభిజీత్ దీప్కే కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. సెంట్రల్ పార్క్‌లో జాతీయ జెండాలను చేతబూని నిరసన తెలిపేందుకు రావాలని సీజేపీ ఇదివరకే ప్రజలకు తమ మద్ధతుదారులకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అభిజీత్ దీప్కే నోటీసులు జారీ చేయడం గమనార్హం.
ఈ వివాదానికి ప్రధాన కారణం అక్టోబర్ 13న జంతర్ మంతర్ వద్ద జరిగిన ఘటన. జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేసిన తర్వాతి రోజే అక్కడ జాతీయ జెండాతో ప్రవేశించినందుకు కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు అరెస్ట్ చేసి 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. దీనిని నిరసిస్తూ, ఎన్నికల అక్రమాలపై కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో ఈ నిరసన ప్రదర్శనకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే పరిపాలనాపరమైన కారణాల వల్ల సెంట్రల్ పార్క్‌ను శుక్ర, శనివారాల్లో మూసివేస్తున్నట్లు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ప్రకటించింది. అయితే ఓ నిర్దిష్ట ప్రదేశంలో పరిమిత సంఖ్యలో ప్రజలు జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయగీతం పాడేందుకు సహకరిస్తామని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.

నోటీసులు ఇచ్చేందుకు తన వద్దకు వచ్చిన పోలీసులతో 31 ఏళ్ల అభిజీత్ దీప్కే తీవ్ర వాగ్వాదానికి దిగారు. భుజంపై జాతీయ జెండాను ధరించి, సోఫాలో కూర్చొని ఉన్న ఆయన పోలీసులు ఇచ్చిన పత్రాలను పరిశీలిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "మీరు సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొడుతున్నారు అది చట్టవిరుద్ధం" అని నోటీసులో రాసి ఉన్న అంశాలను బిగ్గరగా చదివి వినిపిస్తూ పోలీసులను నిలదీశారు. "ఏంటి ఈ విడ్డూరం? దీన్ని అసలు నోటీసు అంటారా? మీకు తోచినదంతా రాసుకొచ్చారా?" అని ఆయన ఢిల్లీ పోలీసులను ప్రశ్నించారు.
నోటీసులోని అంశాలను తప్పుబడుతూ.."నన్ను ఉరితీయండి, ఇదో పెద్ద జోక్‌లా తయారైంది" అని అభిజీత్ దీప్కే నిలదీశారు. తాను ఎక్కడైనా హింసను ప్రేరేపించినట్లు లేదా చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఓ వీడియోనైనా చూపించగలరా అని పోలీసులకు సవాల్ విసిరారు. పోలీసులు ఆయన ఇంట్లోనే వీడియో రికార్డింగ్ చేస్తుండగా.. "మీరు నాకు సంబంధించి అలాంటి ఒక్క వీడియో కూడా చూపించలేరు" అని తేల్చి చెప్పారు. ఢిల్లీలో ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
Delhi Police have reached Abhijeet Dipke’s residence. They are not there to detain him, but to question him about this evening’s protest at CP.Delhi Police are speaking to him politely, but this Kejriwal student is responding with attitude and smart remarks. Even a simple conversation seems too much for someone who thinks he can get away with talking back to everyone.
— Amit Kumar Sindhi (@AMIT_GUJJU) October 16, 2026














Click it and Unblock the Notifications
