ఓటీటీలోకి వస్తున్న రూ.2500 కోట్ల హారర్ థ్రిల్లర్!

హారర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. అందులోనూ కనీస బడ్జెట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద కోట్ల వర్షం కురిపించే సినిమాలు అప్పుడప్పుడు సినీ ప్రియులను ఆశ్చర్యపరుస్తుంటాయి. సరిగ్గా అలాంటి అద్భుతాన్నే సృష్టించింది హాలీవుడ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్'. భారీ కాస్టింగ్, వందల కోట్ల హంగామా ఏమీ లేకుండా కేవలం కంటెంట్‌తోనే థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లాంక్ అయ్యే హారర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.

Ranabaali Movie Review: రణబాలి సినిమా రివ్యూ.. రాయలసీమ యోధుడిగా విజయ్ దేవరకొండ మెప్పించాడా?
Ranabaali Movie Review: రణబాలి సినిమా రివ్యూ.. రాయలసీమ యోధుడిగా విజయ్ దేవరకొండ మెప్పించాడా?

థియేటర్ వెర్షన్‌కు మించి.. అన్‌కట్ హారర్ విందు!

కర్రీ బార్కర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం, థియేటర్లలో చూసిన వెర్షన్‌ కంటే మరింత భయంకరమైన, పూర్తి నిడివితో కూడిన 'అన్ కట్ వెర్షన్'తో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వస్తుండటం విశేషం. హాలోవీన్ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని అక్టోబర్ 30న సాయంత్రం 7 గంటల నుంచి 'జియో హాట్‌స్టార్'లోని 'ది పీకాక్ హబ్'లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ భాషలోనూ అందుబాటులోకి వస్తుండటంతో హారర్ లవర్స్ ఈ అన్‌కట్ వెర్షన్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Obsession A Massive Horror Thriller With a 2500 Crore Valuation Is Coming to OTT

రూ.10 కోట్లతో తీస్తే.. రూ.2500 కోట్ల వసూళ్లా?

ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్ల లెక్కలు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కేవలం రూ.7 కోట్ల నుంచి రూ.10 కోట్ల అంచనా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిన్న సినిమా, బాక్సాఫీస్ వద్ద మాత్రం విధ్వంసమే సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా వందల మిలియన్ డాలర్ల వసూళ్లతో దాదాపు రూ.2,500 కోట్లకు పైగా రాబట్టిందని పలు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తక్కువ బడ్జెట్ చిత్రాల్లో సంచలన రికార్డులు నెలకొల్పిన సినిమాల్లో ఒకటిగా ఇది నిలిచింది.

10 రోజుల్లో రూ. 500 కోట్లా.. ఈ సినిమా బాక్సాఫీస్ ర్యాంపేజ్ బాసూ..!
10 రోజుల్లో రూ. 500 కోట్లా.. ఈ సినిమా బాక్సాఫీస్ ర్యాంపేజ్ బాసూ..!

కథ ఏంటంటే..

మైఖేల్ జాన్సన్, ఇండే నవారెట్టే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్ర కథంతా ఓ యువకుడి విపరీతమైన ప్రేమ, మోహం చుట్టూ తిరుగుతుంది. తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మనసు గెలుచుకోవడానికి ఆ యువకుడు ఒక అతీంద్రియ శక్తులున్నవస్తువును ఆశ్రయిస్తాడు. అనుకున్నట్లే ఆమె ప్రేమ దక్కినా.. ఆ తర్వాతే అసలు నరకం మొదలవుతుంది. మనసులోని ఆశ హద్దులు దాటి 'అబ్సెషన్'గా మారితే ఎలాంటి భయంకరమైన పరిణామాలకు దారితీస్తుందనేది దర్శకుడు తెరపై భయానకంగా ఆవిష్కరించారు. థియేటర్లలో సీట్ ఎడ్జ్ థ్రిల్‌ను అందించిన ఈ హారర్ సెన్సేషన్, ఓటీటీలోని అన్‌కట్ వెర్షన్‌తో డిజిటల్ ప్రేక్షకులను ఏ స్థాయిలో భయపెడుతుందో చూడాలి.!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+