మిథున్ రెడ్డికి జగన్ ఫోన్, ఘటన పై ఆరా- వదిలేది లేదు..హెచ్చరిక..!!
స్థానిక సంస్థల ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలి రోజునే టీడీపీ - వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. వాహనాల ధ్వంసం.. దాడులు.. కార్యాలయాలకు నిప్పు వంటి ఘటనలు జరిగాయి. ఎంపీ మిథున్ రెడ్డి పైన దాడికి ప్రయత్నం జరగటం పై మాజీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. సమర్ధవంతంగా ఎదుర్కొని ముందుకు వెళ్దామని స్పష్టం చేసారు.
స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ ఘర్షణలు మొదలయ్యాయి. పుంగనూరు, రాయచోటిలో టీడీపీ - వైసీపీ మధ్య ఘర్షణలు జరిగాయి. రాళ్ల దాడులు... వాహనాల దగ్దం చోటు చేసుకున్నాయి. ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్ పైన దాడి జరిగింది. అదే విధంగా రాయచోటిలోనూ వాహనాలను దగ్దం చేసారు. దీంతో.. ఎంపీ మిథున్కు మాజీ సీఎం జగన్ ఫోన్ చేసారు. జరిగిన ఘటనల పైన ఆరా తీసారు. గాయపడిన మిథున్ రెడ్డిని పరామర్శించారు. ఘటన సమయంలో పోలీసుల స్పందన పైనా అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికలు సజావుగా జరపాలన్న ఉద్దేశం చంద్రబాబుకు లేదని జగన్ వ్యాఖ్యానించారు. రెండున్నరేళ్ల పరిపాలనపట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబు పై విమర్శలు
ప్రజా వ్యతిరేకత ఉందని గుర్తించి అరాచకాలు, దాడులకు పాల్పడుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. హింసా రాజకీయాలు చంద్రబాబుకు కొత్తేమీ కాదని విమర్శించారు. రాష్ట్రాన్ని జంగిల్ రాజ్లా మార్చారని మండిపడ్డారు. లోక్సభలో పార్టీ నాయకుడికే భద్రతలేని పరిస్థితులు చూస్తున్నాని జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారని.. పోలీసు లను వాడుకుని అక్రమాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దాడులు జరుగుతున్న పోలీసు వ్యవస్థ నిస్తేజంగా ఉండిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ అన్యాయాలను సమర్థంతంగా ఎదుర్కొం టామని.. న్యాయపరంగా, చట్టపరంగా అన్ని రకాలుగా పోరాటం చేస్తామని జగన్ ప్రకటించారు. ధైర్యం, సహనంతో ఈ ఎన్నికలను ఎదుర్కొంటామని చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులను కోర్టుల ముందు ఉంచుతామని.. పారామిలటరీ బలగాలతోనే ఎన్నికలు సజావుగా సాగుతాయన్నారు. ఇదే విషయాన్ని కోర్టుల ముందు ఉంచుతామని..హింసతో రాష్ట్రాన్ని నాశనంచేస్తున్న చరిత్ర చంద్రబాబుది అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.













Click it and Unblock the Notifications
