బెంగళూరు గీతం యూనివర్శిటీలో గుంతకల్లు విద్యార్థిని ఆత్మహత్య

బెంగళూరు రూరల్ జిల్లా దొడ్డబళ్ళాపుర తాలూకా పరిధిలో దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. నాగదేనహళ్లి వద్ద ఉన్న ప్రసిద్ధ గీతం యూనివర్సిటీ హాస్టల్ భవనం ఆరో అంతస్తు నుండి కిందపడి 20 ఏళ్ల విద్యార్థిని దుర్మరణం చెందారు. హాస్టల్ ప్రాంగణంలో అందరూ చూస్తుండగానే ఊహించని రీతిలో ఈ ఘటన జరగడంతో తోటి విద్యార్థులు, వర్సిటీ యాజమాన్యం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

మృతురాలి పేరు వర్షిత. స్వస్థలం.. ఏపీలోని గుంతకల్లు. గీతం యూనివర్శిటీలో ఆమె ఇంజినీరింగ్ చదువుతున్నారు. ఘటన చోటు చేసుకోవడానికి కొద్దిసేపటి ముందు వర్షిత తన మొబైల్ ద్వారా కన్నవారికి ఓ భావోద్వేగ మెసేజ్ పంపించారు. "ఐ లవ్ యు డాడ్.. ఐ లవ్ యు మామ్" అంటూ ఆమె పంపిన చివరి మెసేజ్ చూసి కంగారుపడుతూ ఆమెకు ఫోన్ చేయగా.. అప్పటికే హాస్టల్ భవనం పైనుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందింది. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

20 year old female student died after falling from 6th floor building at Gitam University Bengaluru

ఈ సమాచారం అందుకున్న వెంటనే దొడ్డబళ్ళాపుర రూరల్ సీఐ, ఎస్ఐ నేతృత్వంలోని పోలీస్ బృందం గీతం యూనివర్శిటీకి చేరుకుంది. ఫోరెన్సిక్ నిపుణులు, క్లూస్ టీమ్‌తో కలిసి ఘటన స్థలంలో ప్రాథమిక ఆధారాలు సేకరించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోన్నామని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరణానికి గల కచ్చితమైన కారణాలు తెలుస్తాయని స్పష్టం చేశారు.

మావాడు సేఫ్ గా ఇంటికి రాకపోతే..: పెద్దిరెడ్డి స్ట్రిక్ట్ వార్నింగ్
మావాడు సేఫ్ గా ఇంటికి రాకపోతే..: పెద్దిరెడ్డి స్ట్రిక్ట్ వార్నింగ్

వర్షిత అకాల మరణంతో గీతం యూనివర్సిటీ క్యాంపస్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థిని ఇలా అకస్మాత్తుగా దూరమవ్వడాన్ని తోటి విద్యార్థులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం దొడ్డబళ్ళాపుర రూరల్ పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణను వేగవంతం చేశారు. వర్షిత ఉపయోగించిన మొబైల్ ఫోన్ కాల్ డేటా, చివరి వాట్సాప్ మెసేజ్‌లను పోలీసులు విశ్లేషిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+