Viral Video: ప్రధాని మోదీ ప్రశంసలు... వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ వైరల్!

Viral Video: టీమిండియా యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కెరీర్లో మరో చిరస్మరణీయ ఘట్టం చోటుచేసుకుంది. ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన భారత జట్టును ప్రశంసిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వార్తల్లో నిలిచాయి. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో గరువారం(అక్టోబర్ 15) జరిగిన ప్రత్యేక సన్మాన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నోటి నుంచి తన పేరు, ప్రశంసలు విన్న సమయంలో వైభవ్ సూర్యవంశీ ముఖంలో విరిసిన చిరునవ్వుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

IND vs WI: ఉచిత పాస్‌లతో లక్షల దందా.. భారత్–విండీస్ మ్యాచ్‌కు ముందు నలుగురు అరెస్ట్!
IND vs WI: ఉచిత పాస్‌లతో లక్షల దందా.. భారత్–విండీస్ మ్యాచ్‌కు ముందు నలుగురు అరెస్ట్!

ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నంత సేపు వైభవ్ సూర్యవంశీ ఎంతో ఉత్సాహంగా, నవ్వుతూ కనిపించాడు. ఈ క్షణం వైభవ్ సూర్యవంశీకి, బేబీబాస్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా మారింది. సన్మాన సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. యువ అథ్లెట్ల విజయాలను ప్రత్యేకంగా అభినందించారు. " ఈ సారి ఆసియా క్రీడల్లో టీమిండియా తరఫున 15 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అనేక మంది యువ క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ అద్భుత ప్రతిభతో దేశ ప్రజల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా భారతమాతకు గర్వకారణంగా నిలిచారు. గెలుపు సాధించడానికి వయస్సుతో సంబంధం లేదని, చిన్న వయసులోనే క్రీడల్లోకి అడుగుపెట్టడం వల్ల అదనపు ప్రయోజనం లభిస్తుందని ఈ క్రీడాకారులు నిరూపించారు" అని ప్రధాని మోదీ కొనియాడారు.

Vaibhav Sooryavanshi Reaction Viral PM Narendra Modi Praises Asian Games Hero Video Goes Viral

చిన్న వయసులోనే క్రీడా ప్రతిభను గుర్తించి, వారికి సరైన వేదిక కల్పించడం ఎంతో కీలకమని ప్రధాని ఈ సందర్బంగా పేర్కొన్నారు. ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లల్లోని ప్రతిభను ప్రారంభంలోనే గుర్తించి వారికి తగిన ట్రైనింగ్ అందించడంపై సర్కారు ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. ఖేలో ఇండియా, ఎమర్జింగ్ ఖేలో ఇండియా వంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో వేలాది మంది క్రీడాకారులను తీర్చిదద్దడానికి దోహదపడతాయని వెల్లడించారు. అంతే కాకుండా 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్, 2030 కామన్వెల్త్ గేమ్స్, అలాగే 2036లో భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహించాలనే లక్ష్యాలకు అనుగుణంగా ఇప్పటి నుంచే క్రీడాకారులు సన్నాహాలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఈ పతకాల వేటలో మహిళా అథ్లెట్ల పాత్రను కూడా ప్రధాని మోదీ ప్రత్యేకంగా కొనియాడారు.

ఢిల్లీని పాకిస్తాన్ బోర్డర్ లా మార్చేశారు.. ఎందుకో జనానికి తెలుసు: ఏకిపారేసిన అభిజిత్ దిప్కే
ఢిల్లీని పాకిస్తాన్ బోర్డర్ లా మార్చేశారు.. ఎందుకో జనానికి తెలుసు: ఏకిపారేసిన అభిజిత్ దిప్కే

ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో భారత జట్టుతో కలిసి బిజీగా ఉన్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ముగిసిన 4 మ్యాచ్‌లలో వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో ఆడే అవకాశం దక్కకపోయినప్పటికీ.. ఆసియా క్రీడల విజయం, ప్రధాని మోదీ అందించిన ప్రోత్సాహం వైభవ్ సూర్యవంశీలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+