CJP Protest: ముంబైలో కాక్రోచ్ ల పోరు ప్రారంభం..! చేతులెత్తేసిన పోలీసులు..!

కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ పేరుతో 13 కోట్ల ఓట్లను తొలగించడం, దీనిపై అభ్యంతరాలు వ్యక్తమైనా పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ముంబైలో భారీ ధర్నా చేపట్టింది. సాయంత్రం 4 గంటలకు సీజేపీ నేతలు ఈ ధర్నా ప్రారంభించారు. దేశద్రోహి సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ భారీ ఫ్లెక్సీని పెట్టి శివాజీ పార్క్ వద్ద ఈ ఆందోళనను మొదలుపెట్టారు. దేశభక్తి గీతాల మధ్య కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని జాతీయ జెండాలతో హల్ చల్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా సీజేపీ కన్వీనర్ అభిజీత్ దిప్కేను కలిసి సంఘీభావం ప్రకటించారు.

బీజేపీ వారు కొంతమంది కార్యకర్తలను పంపారని, తాము కొన్ని ఫొటోల్ని కూడా పోలీసులకు ఇచ్చామని సీజేపీ నేత సౌరవ్ దాస్ తెలిపారు. శివాజీ పార్క్ ప్రాంతానికి చెందిన స్థానికులతో పాటు మా మిత్రులు ధర్మేంద్ర ప్రధాన్ గారి మాజీ ఓఎస్‌డీ కూడా అక్కడ కనిపించడం ఆ చిత్రాలలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఏ స్థానిక నివాసి గానీ లేదా దేశంలోని ఏ పౌరుడు గానీ ఈ నిరసనను వ్యతిరేకించరన్నారు. ఎందుకంటే తమ ఓట్లు దొంగిలించబడాలని లేదా తమ హక్కులు ఉల్లంఘించబడాలని ఎవరూ కోరుకోరని సౌరవ్ తెలిపారు.

CJP Launches Jail Bharo Andolan at Shivaji Park Says Gandhi Didn t Seek British Permission

మరోవైపు కాక్రోచ్ పార్టీ ఆందోళనకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ నిరసన చేపట్టింది. మహాత్మాగాంధీ బ్రిటీషర్ల అనుమతి తీసుకుని ఉద్యమం చేశారా అని కాక్రోచ్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాక్రోచ్ ల నిరసనతో శివాజీ పార్క్ పరిసరాల్లో భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు.సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఈ ప్రదర్శన దృష్ట్యా.. పోలీసులు, రైల్వే అధికారులు ముంబై నగర నడిబొడ్డున ఉన్న దాదర్ స్టేషన్ , ఆ ప్రతిష్టాత్మక మైదానం చుట్టూ బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడానికి, మహిళా సిబ్బందితో కూడిన పోలీసు బృందంతో పాటు ఇతర ఏజెన్సీల భద్రతా బృందాలను కూడా వ్యూహాత్మక ప్రదేశాలలో మోహరించినట్లు ఒక అధికారి తెలిపారు. శివాజీ పార్క్‌లోకి దారితీసే ప్రధాన ప్రవేశ మార్గాల వెంబడి కూడా విస్తృతమైన బారికేడ్లను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+