CJP: కాక్రోచ్ పార్టీకి మరో భారీ విజయం..! ఏకంగా 12,500 కోట్ల ఖర్చుకు సర్కార్ రెడీ..!

నీట్ పరీక్ష అక్రమాలపై ఢిల్లీ జంతర్ మంతర్ లో ఉద్యమం చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించడంలో సక్సెస్ అయిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP), తన రెండో ప్రాజెక్ట్ లోనూ విజయం సాధిస్తోంది. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం సీజేపీ ప్రారంభించిన ఉద్యమానికి మంచి స్పందన లభిస్తోంది. రాజస్థాన్ లో శిధిలావస్ధలో, పశువుల కొట్టాల్లో నిర్వహిస్తున్న స్కూళ్లను (Rajasthan Schools) సందర్శించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన సీజేపీ అనుకున్నది సాధించుకుంది.

 కాక్రోచ్ దెబ్బకు బీజేపీలో రెండో వికెట్..! కొత్త టీమ్ లో కీలక నేతపై వేటు..!
కాక్రోచ్ దెబ్బకు బీజేపీలో రెండో వికెట్..! కొత్త టీమ్ లో కీలక నేతపై వేటు..!

రాజస్థాన్ లోని స్కూళ్ల దీనావస్థపై కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు చేపట్టిన ఉద్యమం విజయవంతమైంది. దారుణంగా ఉన్న స్కూళ్లను సందర్శించేందుకు కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు చేసిన ప్రయత్నాలను ముందు బీజేపీ కార్యకర్తలు స్థానికులతో కలిసి అడ్డుకోవడమే కాకుండా దాడులు కూడా చేశారు. అయితే ఈ వ్యవహారం రాజస్థాన్ తో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో అక్కడి బీజేపీ ఆధ్వర్యంలోని భజన్ లాల్ శర్మ సర్కార్ పై ఒత్తిడి పెరిగింది. చివరికి బీజేపీ మిత్రపక్షాలు సైతం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రారంభించాయి. దీంతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న రాజస్థాన్ సర్కార్ స్కూళ్ల రిపేర్లకు ముందుకొచ్చింది.

CJP Pressure Pays Off Rajasthan Announces 12 500-Crore School Infrastructure Plan
48 గంటల్లో మొదలుపెడతారా ? నన్ను రమ్మంటారా ?-అభిజీత్ బిగ్ వార్నింగ్..!
48 గంటల్లో మొదలుపెడతారా ? నన్ను రమ్మంటారా ?-అభిజీత్ బిగ్ వార్నింగ్..!

ఇందుకోసం రూ.12500 కోట్ల రూపాయలు కేటాయిస్తామని రాజస్థాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా 3587 స్కూలు భవనాలను రూ.2487 కోట్ల ఖర్చుతో కొత్తగా నిర్మిస్తారు. అలాగే 83,783 క్లాస్ రూమ్ లను కూడా రూ.8378 కోట్ల ఖర్చుతో నిర్మించబోతున్నారు. అలాగే 22589 స్కూళ్లలో మేజర్ రిపేర్ల కోసం రూ.1129 కోట్లు కేటాయించనున్నారు. దీంతో పాటు 340 కకోట్ల ఖర్చుతో 13616 టాయిలెట్ కాంప్లెక్స్ లను కూడా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా స్కూళ్లలో భారీ ఎత్తున అభివృద్ది కార్యక్రమాలను రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పనుల్ని వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+