ముంబై పోరుకు సిద్దమైన కాక్రోచ్ లు..! సీఈసీ రాజీనామాపై తాడోపేడో..!

ఎన్నికల నిర్వహణ, ఎస్ఐఆర్ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడటం ద్వారా అధికార బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ లు ముంబైలో నిరసనకు సిద్దమయ్యారు. రేపు సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్క్ వద్ద జైల్ భరో పేరుతో భారీ కార్యక్రమం చేపట్టబోతున్నారు. సీఈసీని వెంటనే తప్పించి, అరెస్టు చేయాలని కాక్రోచ్ లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో మహా సర్కార్ ఈ నిరసనను అడ్డుకునేందుకు సిద్దమవుతోంది.

AP SIR: ఏపీ ఎస్ఐఆర్-ఈసీ కీలక ఆదేశాలు జారీ- సీఈఓ ప్రకటన..!
AP SIR: ఏపీ ఎస్ఐఆర్-ఈసీ కీలక ఆదేశాలు జారీ- సీఈఓ ప్రకటన..!

మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, 3 డిమాండ్లను ముందుకు తెస్తున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కన్వీనర్ అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) ఇవాళ వెల్లడించారు. ఇందులో మొదటిది జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి, క్రిమినల్ విచారణను ఎదుర్కోవాలి, ఆదేశాలు ఎవరు ఇచ్చారో వెల్లడించాలి. అలాగే రెండవది ఎస్ఐఆర్ (SIR) ను నిలిపివేయాలి, జనవరి 2025 ఓటర్ల జాబితాను పునరుద్ధరించాలి, స్వతంత్ర విచారణకు ఆదేశించాలి. మూడో డిమాండ్ 2023 ఎన్నికల కమిషనర్ల నియామకాల చట్టాన్ని రద్దు చేసి, పౌర సమాజ భాగస్వామ్యంతో పారదర్శక చట్టాన్ని తీసుకురావాలి.

CJP s Abhijeet Dipke Challenges Fadnavis Vows Shivaji Park Protest Over CEC Gyanesh Kumar
సీఈసీపై మహా సమరానికి సిద్ధమైన కాక్రోచ్ లు..! డేట్, టైమ్, ప్లేస్ ప్రకటన..!
సీఈసీపై మహా సమరానికి సిద్ధమైన కాక్రోచ్ లు..! డేట్, టైమ్, ప్లేస్ ప్రకటన..!

వారు తమకు నచ్చిన వారిని కేవలం నిర్ణయించి ఎన్నికల కమిషనర్‌గా నియమించలేరని కేంద్రాన్ని ఉద్దేశించి అభిజీత్ దిప్కే పేర్కొన్నారు. ఈ పదవిలో ఎవరు ఉంటారనే దానిపై 150 కోట్ల మంది జీవితాలు ప్రత్యక్షంగా ప్రభావితమవుతాయన్నారు. ఎన్నికల కమిషనర్ల ఎంపిక స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా మరియు పారదర్శకంగా ఉండాలని దిప్కే కోరారు. ఎస్ఐఆర్ కు ముందే, ఓటర్ల జాబితాను 2025 ఓటర్ల జాబితాతో నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఎస్ఐఆర్ జాబితా ప్రకారం ఎన్నికలు జరిగితే, ప్రధాని మోదీ అమెరికాలో కూడా గెలవగలరని దిప్కే ఎద్దేవా చేశారు. మరోవైపు శివాజీ పార్క్ వద్ద రేపటి కాక్రోచ్ ల ఆందోళనలకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. స్థానికుల ఆందోళనలను ఇందుకు సాకుగా చూపింది. దీనిపై స్పందించిన దిప్కే.. తాము ఎట్టి పరిస్ధితుల్లో జైల్ భరోకు దిగుతామని, చేతనైతే అడ్డుకోవాలని సవాల్ విసిరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+