బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Clash: సోషల్ మీడియా పోస్టు, హిందూ సంస్థ నాయకులపై కత్తులతో దాడి, బైక్ లు, షాపులు బూడిద, నిషేధాజ్ఞలు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/బాగల్ కోట్: బీజేపీ మాజీ నాయకురాలు నుపూర్ శర్మాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారని ఆరోపిస్తూ రెండు వర్గాల మద్య జరిగిన గొడవల కారణంగా ముగ్గురి మీద కత్తులతో, వేటకొడవలితో దాడులు చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మద్య గొడవలు జరగడం, ఇరు వర్గాలు దాడులకు దిగడంతో బైక్ లు, షాపులు, కూరగాయల బండ్లుకు నిప్పు పెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు రంగంలోకిదిగారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు అమలు చేశారు. అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. మరో వర్గం దాడిలో హిందూ జాగరణ వేదిక జిల్లా కార్యదర్శి అరుణ్ తలకు తీవ్రగాయాలై ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నాడు. మాజీ సీఎం నియోజక వర్గంలో ఈ గొడవలు జరిగాయి.

VIVO: వీవో కంపెనీ డైరెక్టర్లు దేశం వదిలి చైనాకు జంప్,ఈడీ దెబ్బతో జింగ్ జాంగ్,జస్ట్ రూ. 10 వేల కోట్లు గోల్ మాల్VIVO: వీవో కంపెనీ డైరెక్టర్లు దేశం వదిలి చైనాకు జంప్,ఈడీ దెబ్బతో జింగ్ జాంగ్,జస్ట్ రూ. 10 వేల కోట్లు గోల్ మాల్

 నుపూర్ శర్మా పోస్టు దెబ్బతో ఒక్కసారిగా గొడవలు

నుపూర్ శర్మా పోస్టు దెబ్బతో ఒక్కసారిగా గొడవలు

మహమ్మద్ ప్రవక్తకు కించపరిచే విదంగా వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ నాయకురాలు నుపూర్ శర్మాను ఆ పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. నుపూర్ శర్మా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. నుపూర్ శర్మాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారని ఆరోపిస్తూ కర్ణాటకలోని బాగల్ కోటే జిల్లాలోని బాదామి తాలుకాలోని కేరూరు పట్టణంలో రెండు వర్గాల మద్య గొడవలు జరిగాయి.

కత్తులు, వేటకొడవళ్లతో దాడులు

కత్తులు, వేటకొడవళ్లతో దాడులు

బుధవారం రాత్రి బాదామి తాలుకాలోని కేరూరు పట్టణంలో రెండు వర్గాల మీద పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. ఆ సందర్బంలో హిందూ జాగరణ వేదిక బాగల్ కోటే జిల్లా కార్యదర్శి అరుణ్ కట్టమని, ఆయన సోదరుడు లక్ష్మణ్ కట్టిమని, యమనూర్ చుంగి అనే ముగ్గురు యువల మీద మరో వర్గానికి చెందిన యువకులు కత్తులు, వేటకొడవళ్లతో దాడి చేశారు.

ఐసీయూలో హిందూ సంస్థ లీడర్

ఐసీయూలో హిందూ సంస్థ లీడర్

రెండు వర్గాల మద్య జరిగిన గొడవల కారణంగా అరుణ్, లక్ష్మణ్, యమనూర్ అనే ముగ్గురి మీద కత్తులతో, వేటకొడవలితో దాడులు చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరుణ్ తల మీద వేటకొడలితో దాడి చెయ్యడంతో అతని పరిస్థితి విషమంగా ఉండటంతో బాగల్ కోటే జిల్లా ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

షాపులు, వాహనాలకు నిప్పు

షాపులు, వాహనాలకు నిప్పు

ఇరు వర్గాలు దాడులకు దిగడంతో కేరూరులో 5 బైక్ లు, 10 షాపులు, ఆ ప్రాంతంలోని కూరగాయల బండ్లుకు, చిన్నచిన్న షాపులకు నిప్పు పెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు రంగంలోకిదిగారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు అమలు చేశారు.

జిల్లా ఎస్పీ పరుగో పరుగు

జిల్లా ఎస్పీ పరుగో పరుగు

విషయం తెలుసుకున్న బాగల్ కోటే జిల్లా ఎస్పీ జయప్రకాష్ కేరూరు పట్టణానికి పరుగు తీసి ఆ ప్రాంతంలో శాంతిభద్రతలు కాపాడటానికి చర్యలు తీసుకున్నారు. బాదామి తాలుకాల కేరూరులో అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. మరో వర్గం దాడిలో హిందూ జాగరణ వేదిక జిల్లా కార్యదర్శి అరుణ్ తలకు తీవ్రగాయాలై ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నాడు. కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న బాదామి నియోజక వర్గంలో ఈ గొడవలు జరిగాయి.

English summary
Clash: Communal clash between 2 groups of people, at least 3 stabbed in Kerur, Bagalkote district in Karnataka. The attackers also set a few vehicles on fire.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X