బీజేపీ వర్సెస్ ఎస్పీ - అయోధ్యలో రాళ్ల దాడి : చెదరగొట్టిన పోలీసులు..!!

ఉత్తర ప్రదేశ్ లో రేపు (ఆదివారం) మూడో విడత పోలింగ్ జరగనుంది. దీని కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి రెండు విడత ఎన్నికల పైన ప్రధానంగా బీజేపీ -ఎస్పీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎవరికి వారు తమదే గెలుపు అని చెబుతున్నాయి. 403 స్థానాలు కలిగిన యూపీ అసెంబ్లీకి ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు విడతల పోలింగ్ అనంతరం మార్చి 10 న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది. మైనారిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్ఐఎమ్ కూడా గట్టి పోటీ ఇస్తోంది.

ఎన్నికల ప్రచారం సైతం హోరా హోరీగా సాగుతోంది. ఈ ప్రచార క్రమంలో అయోధ్యలో బీజేపీ ..సమాజ్ వాదీ పార్టీ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. రాళ్లు రువ్వుకున్నారు. గోసాయీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కబీర్​పుర్​లో ఈ ఘటన చోటు చేసుకుంది.పోలీసు స్టేషన్ ఎదుటే ఈ ఘటన జరగడం విస్మయం కలిగిస్తోంది. కాల్పులు సైతం జరిగినట్లు తెలుస్తోంది.

గోసాయీగంజ్ నియోజకవర్గాన్ని భాజపా, ఎస్పీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. ఎస్పీ నుంచి అభయ్ సింగ్, భాజపా తరఫున ఎమ్మెల్యే ఇంద్ర ప్రతాప్ తివారి ఖబ్బూ సతీమణి ఆర్తీ తివారీ పోటీ చేస్తున్నారు.

clashes between BJP and Samajwadi Party in Uttar Pradesh

ప్రచారంలో భాగంగా రెండు వర్గాలకు చెందిన కార్లు ఎదురుపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో..ఒక పార్టీ పై మరో పార్టీ కార్యకర్తలు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఘటనపై ఎస్పీ నాయకులు పోలీస్ స్టేషన్​ను ఆశ్రయించారు. తమపై దాడి చేసిన బీజేపీ శ్రేణులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్​పైనా రాళ్లు విసిరారు.

దీంతో బలగాలను ఉపయోగించి ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. దీని పైన పోలీసు అధికారులు స్పందించారు. ఈ ఘర్షణలో నాలుగు వాహనాలు ధ్వంసం అయినట్లుగా వెల్లడించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని... ఘటన పైప పూర్తి సమాచారంతో విచారణ కొనసాగిస్తామని ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+