ఇక హర్యానాలో ఘర్షణలు: రాళ్ల దాడులు- కాల్పులు
చండీగఢ్: భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న హర్యానాలో తాజాగా దాడులు చోటు చేసుకున్నాయి. రెండు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు సంభవించాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఘర్షణలకు పాల్పడిన చెదరగొట్టారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
హర్యానాలోని నూహ్ జిల్లాలో ఈ మధ్యాహ్నం ఈ ఘటన సంభవించింది. విశ్వహిందూ పరిషత్- మాతృశక్తి దుర్గా వాహిణి సంయుక్తంగా నిర్వహించిన బ్రిజ్ మండల్ మేవాత్ శోభాయాత్ర సందర్భంగా ఈ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నూహ్ జిల్లా మేవాత్‌లోని ప్రఖ్యాత నల్హర్ మహదేవ్ ఆలయం మీదుగా ఈ శోభాయాత్ర సాగుతున్నప్పుడు మరో వర్గం వారు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

ఇద్దరు ముస్లిం యువకులు నాజిర్, జునైద్‌ను సజీవ దహనం చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న గో సంరక్షకుడు మోనూ మనేసర్ ఈ శోభాయాత్రలో పాల్గొనాల్సి ఉండటం మరో వర్గానికి ఆగ్రహావేశాలను కలిగించిందని చెబుతున్నారు. నల్హర్ మహదేశ్ ఆలయం వద్ద ఈ శోభాయాత్రను ఉద్దేశించి మోనూ మనేసర్ ప్రసంగించాల్సి ఉంది.
తిరంగా పార్క్ సమీపంలోకి రాగానే ఈ శోభాయాత్రపై ఒక వర్గానికి చెందిన వారు రాళ్లు రువ్వారు. వీహెచ్‌పీ- మాతృశక్తి దుర్గా వాహిణి ప్రతినిధులు ఈ దాడిని తిప్పి కొట్టారు. దీనితో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులపైనా వాళ్లు రాళ్లు రువ్వారు. వాహనాలను ధ్వంసం చేశారు.
#WATCH | Clashes erupt between two groups in Haryana's Nuh
— ANI (@ANI) July 31, 2023
Further details awaited pic.twitter.com/huZVBzjK4d
పరిస్థితులు అదుపు తప్పడంతో పారా మిలటరీ బలగాలను పంపించారు. అల్లర్లను అదుపు చేయడానికి పోలీసులు గాలిలో కాల్పులు జరిపారు. ఈ ఘటన తరువాత నుహ్-హోడల్ మార్గాన్ని పోలీసులు మూసివేశారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలను దారి మళ్లించారు. నుహ్‌లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. అల్లర్లు సంభవించినట్లు తెలియగానే ప్రజలు దుకాణాలను మూసివేశారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఓఎస్డీ జవహర్ యాదవ్ మాట్లాడారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. పరిస్థితి అదుపులోనే ఉందని పేర్కొన్నారు. ఎవరూ ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications