వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శ్రీనగర్‌లో ఎదురుకాల్పులు, ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్‌లో ఆదివారం ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్ శివార్లలోని ముజ్‌గంద్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
శనివారం సాయంత్రం ప్రారంభమైన ఎదురు కాల్పులు ఆదివారం కూడా కొనసాగాయి. ఈ కాల్పుల్లో అయిదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారని తెలుస్తోంది.

ముజ్‌గంద్‌లో శ్రీనగర్-బందిపొరా రహదారిపై భద్రతా దళాలు శనివారం సాయంత్రం తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఎదురుపడిన ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. సైన్యం ఈ కాల్పులను సమర్థంగా తిప్పికొడుతోంది.
దాదాపు ఇరవై గంటలుగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనగర్‌లో మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.