తెగ తాగేశారు: పిలిచి మత్తు ఇచ్చి ఆమెపై అఘాయిత్యం చేశారు

Posted By:
Subscribe to Oneindia Telugu

సోనార్పూర్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 12వ తరగతి విద్యార్థినిపై మిత్రులే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాష్ట్రంలోని సౌత్ 24 పరగణాల జిల్లా రథతలాలో ఓ పుట్టిన రోజు వేడుకల్లో బాలికపై నలుగురు అఘాయిత్యానికి పాల్పడ్డారు.

ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నాలుగో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.

 చంపడానికి చూశారు

చంపడానికి చూశారు

అత్యాచారం చేసిన తర్వాత బాలికను చంపడానికి కూడా ప్రయత్నించారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బాయ్ ఫ్రెండ్ ఆమెను తన అంకుల్స్ ఇంటికి ఆహ్వానించాడు.

బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడు

బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడు

ఇంట్లోని వారంతా ఓ కుటుంబ వేడుకకు వెళ్లారు. దాంతో ఆమె వెళ్లిన సమయంలో ఇల్లు ఖాళీగా ఉంది.బాయ్‌ఫ్రెండ్ తన ముగ్గురు మిత్రులతో కలిసి మద్యం సేవిస్తూ ఆమెకు కనిపించారు. మోసపూరితంగా మత్తు మందు కలిపిన డ్రింక్స్ ఆ అమ్మాయికి ఇచ్చారు.

నలుగురు తెగబడ్డారు

నలుగురు తెగబడ్డారు

దాంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశారు. ఇంటి సభ్యులు వచ్చేసరికి అమ్మాయి నెత్తురోడుతూ కనిపించింది. ప్రమాదం జరిగిందంటూ వారు అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

 పోలీసులకు ఫిర్యాదు చేశారు

పోలీసులకు ఫిర్యాదు చేశారు

అయితే, అమ్మాయి కుటుంబ సభ్యులకు వారి మాటలు నిజం కాదని అనిపించింది. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A class 12 student was allegedly raped and seriously injured by four of her friends at a birthday party at Rathtala in South 24 Parganas district, police said on Wednesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి