బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Classroom: ప్రభుత్వ స్కూల్ క్లాస్ రూమ్ లో నమాజ్, హిజాబ్ గొడవల టైమ్ లో?, వీడియో వైరల్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ఉడిపి: హిజాబ్ వివాదానికి తెర దించాలని అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే హిజాబ్ వివాదం కోర్టులో ఉండటంతో కర్ణాటక ప్రభుత్వం, ప్రజలు కూడా కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉంది. విద్యాసంస్థల్లో మతపరమైన ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని, హిజాబ్ లు, కాషాయం కండువాలు వేసుకోకూడన ఇప్పటికే కర్ణాటక హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హిజాబ్ వివాదంతో ఇప్పటికే విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఫిబ్రవరి 16వ తేదీ తరువాత కాలేజ్ లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి సమయంలో కాలేజ్ లోని ఒక క్లాస్ రూమ్ లో కొందరు ముస్లీం విద్యార్థులు నమాజ్ చేస్తున్న వీడియో బయటకు రావడం కలకలం రేపింది. హిజాబ్ గొడవలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వ స్కూల్ లోని క్లాస్ రూమ్ లో నమాజ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విషయం తెలుసుకున్న విద్యాశాఖా అధికారులు తరగతి గదిలో నమాజ్ చెయ్యడానికి ఎవరు అవకాశం ఇచ్చారు, నమాజ్ చేసిన విద్యార్థులు ఎవరు ?, ఎప్పుడు నమాజ్ చేశారు ? అనే పూర్తి సమాచారం ఇవ్వాలని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కు, ఉపాద్యాయులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కాలేజ్ లోని క్లాస్ రూమ్ లో నమాజ్ చేశారని వెలుగు చూడటం కర్ణాటకలో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.

Illegal affair: భర్త చనిపోయి వారం కాకుండానే కోడలు ?, అత్తకు డౌట్, మొబైల్ ఫోన్ లో!Illegal affair: భర్త చనిపోయి వారం కాకుండానే కోడలు ?, అత్తకు డౌట్, మొబైల్ ఫోన్ లో!

 విద్యాసంస్థల్లో కచ్చితంగా ఆదేశాలు పాటించాలి

విద్యాసంస్థల్లో కచ్చితంగా ఆదేశాలు పాటించాలి

హిజాబ్ వివాదానికి తెర దించాలని అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే హిజాబ్ వివాదం కోర్టులో ఉండటంతో కర్ణాటక ప్రభుత్వం, ప్రజలు కూడా కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉంది. విద్యాసంస్థల్లో మతపరమైన ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని, హిజాబ్ లు, కాషాయం కండువాలు వేసుకోకూడన ఇప్పటికే కర్ణాటక హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

 క్లాస్ రూమ్ లో నమాజ్...... సోషల్ మీడియాలో వైరల్

క్లాస్ రూమ్ లో నమాజ్...... సోషల్ మీడియాలో వైరల్

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని కడబా తాలుకాలోని అంకతడ్కలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని ఒక క్లాస్ రూమ్ లో కొందరు ముస్లీం విద్యార్థులు నమాజ్ చేస్తున్న వీడియో బయటకు రావడం కలకలం రేపింది. హిజాబ్ గొడవలు జరుగుతున్న సమయంలో కడబా సమీపంలోని స్కూల్ లోని క్లాస్ రూమ్ లో నమాజ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

 విద్యాశాఖ అధికారులు ఎంట్రీ

విద్యాశాఖ అధికారులు ఎంట్రీ

విషయం తెలుసుకున్న కర్ణాటక విద్యాశాఖా అధికారులు, దక్షిణ కన్నడ జిల్లా అధికారులు స్కూల్ లోని తరగతి గదిలో నమాజ్ చెయ్యడానికి ఎవరు అవకాశం ఇచ్చారు, నమాజ్ చేసిన విద్యార్థులు ఎవరు ?, ఎప్పుడు నమాజ్ చేశారు ? అనే పూర్తి సమాచారం ఇవ్వాలని ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ కు, అధ్యాపకులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

Recommended Video

Hijab Row: హిజాబ్ వివాదం Karnataka విద్యాసంస్థలకు సెలవు | Priyanka Gandhi | Oneindia Telugu
 చెప్పినా మాట వినడం లేదు

చెప్పినా మాట వినడం లేదు

స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది సేకరించిన సమాచారం ప్రకారం ఈనెల 4వ తేదీన కొందరు విద్యార్థులు తరగతి గదిలో నమాజ్ చేశారని వెలుగు చూసింది. విద్యార్థులు నమాజ్ చేసే సమయంలో కొందరు వీడియో తీశారని, హిజాబ్ గొడవలు ఎక్కువ జరగడంతో ఆ వీడియోను బయటపెట్టారని వెలుగు చూసింది. హిజాబ్ వివాదంతో ఇప్పటికే విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఫిబ్రవరి 16వ తేదీ తరువాత కాలేజ్ లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి సమయంలో క్లాస్ రూమ్ లో నమాజ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియో బయటకు కావడంతో కర్ణాటకలో మరోసారి కలకలం రేపింది.

English summary
Classroom: A video went viral on social media platforms of a few students from the Muslim community purportedly offering 'namaz' inside the classroom of a government primary school at Ankathadka in Kadaba taluk of Karnataka's Dakshina Kannada district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X