14 నిమిషాల అద్భుతం: వందే భారత్.. జెట్ స్పీడ్..!!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా స్వచ్ఛతే సేవా, స్వచ్ఛతా వారోత్సవాలను చేపట్టింది. ఇందులో భాగంగా అనేక పర్యాటక కేంద్రాలు, సముద్ర తీరాలు, బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు పార్లమెంట్ ఆవరణలో సైతం స్వచ్ఛ భారత్‌ను నిర్వహించింది.
ఇందులో భాగంగా దేశ రాజధానిలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టింది రైల్వే మంత్రిత్వ శాఖ. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో క్లీనింగ్ నిర్వహించింది. భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇది. ఢిల్లీ కంటోన్మెంట్ స్టేషన్ వరకు వెళ్లాల్సి ఉంది.

ఈ మధ్యాహ్నం హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ ప్లాట్‌ఫామ్ మీదికి వచ్చిన వెంటనే సిబ్బంది క్లినింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. 14 నిమిషాల్లో మొత్తం రైలు కోచ్‌లన్నింటినీ శుభ్రం చేశారు. విండ్ స్క్రీన్ సహా విండో గ్లాసెస్, రైలులో ప్రయాణికులు వేసిన ఖాళీ వాటర్ బాటిళ్లు, రేఫర్స్, ఇతర నిరర్థక వస్తువులను ఎత్తివేశారు.
#WATCH | Delhi: A 14-minute cleanliness drive was conducted for the Rani Kamalapati-Hazrat Nizamuddin Vande Bharat Express train at Hazrat Nizamuddin Railway Station. pic.twitter.com/A1GfkmG2tb
— ANI (@ANI) October 1, 2023
సాధారణంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులు వేసే చెత్త, ఇతర వ్యర్థ పదార్థాలను గమ్యస్థానం చేరిన తరువాత ఎత్తిపారేయడం, కోచ్‌లన్నింటినీ శుభ్రపరచడం చేస్తుంటారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో దీన్ని నిర్వహించారు. 14 నిమిషాల్లో రైలునంతటినీ క్లీన్ చేశారు.
ఈ క్లీనింగ్ కార్యక్రమానికి సంబంధించిన రైల్వే మంత్రిత్వ శాఖ ఓ వీడియోను విడుదల చేసింది. రైల్వే స్టేషన్ ఉద్యోగులు, కిందిస్థాయి సిబ్బంది రైలును శుభ్రం చేస్తోన్న సన్నివేశాలతో కూడిన వీడియో ఇది. పెద్ద పెద్ద సంచుల్లో ప్లాస్టిక్ బాటిళ్లను ఎత్తేయడాన్ని బట్టి చూస్తోంటే- వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లల్లో చెత్త అధికమౌతోందనేది స్పష్టమౌతోంది.












Click it and Unblock the Notifications