నూతన ఎంపీ నుస్రత్ జహాన్‌కు ఫత్వా...హిందు సంప్రదాయంలో ప్రమాణ స్వీకారంపై మండిపాటు...!
పశ్చిమ బెంగాల్ నటి..ఇటివల జరిగిన ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ నుండి నూతన పార్లమెంట్ సభ్యులురాలిగా ఎన్నికైన నుస్రత్ జహాన్ సైతం మతపరమైన వేధింపులను ఎదుర్కోంటుంది..ముస్లిం అయిన నుస్రత్ జహాన్, హిందు యువకుడిని పెళ్లి చేసుకోడంతోపాటు కాలీకి మట్టెలు పెట్టుకోవడం పై ముస్లిం మత పెద్దలు ఆమే ఫత్వా జారీ చేశారు. దీంతో మరోసారి ఒక యువ ఎంపీ విషయంలో ఫత్వా జారి చేయడంతో బెంగాల్‌లో మరో వివాదానికి తెరలేచింది.

ఎంపీకైనా తప్పని ఫత్వాలు
నుస్రత్ జహాన్ పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ నటి, అనంతరం రాజకీయ నాయకురాలిగా అవతారమెత్తిన ఆమే తృణముల్ కాంగ్రెస్ పార్టీ నుండి బసిర్హాత్ లోక్‌సభ స్థానం నుండి పోటి చేసి బీజేపీ అభ్యర్థిపై సుమారు మూడున్నర లక్షల ఓట్లకు పైగా మెజారిటితో గెలుపోందారు..అయితే అమే ఎంపీగా ఎన్నికైన అనంతరం వివాహాం చేసుకుంది..ఒక వ్యాపారి అయిన జైన మతానికి చెందిన యువకుడు నిఖిల్ జైన్‌తో లండన్‌లో వివాహం అయింది.. ఇక హిందు యువకున్ని పెళ్లి చేసుకున్న ఆమే మెడలో తాళీ, కాళ్లకు మట్టేలతో ప్రమాణా స్వీకారం చేసేందుకు వివాహ అనంతరం ఈనెల 25న పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేశారు..

షరియత్‌లో ఎముందో చేప్పేందుకే ఫత్వా జారీ...
దీంతో ముస్లిం మత పెద్దలు ఆమే వ్యవహార శైలిపై ఫత్వా జారీ చేశారు.ముస్లిం యువతి అయి ఉండి ఇతర మత సంప్రాదాయాలు పాటించడంపై ఆమేను ప్రశ్నించారు.ఈనేపథ్యంలో ముస్లిం షరియత్‌ను నస్రత్ ఉల్లంఘించారంటూ ముఫ్తి అసద్ వాస్మీ అనే మత పెద్ద ఫత్వా జారీ చేశారు. అందులో ముస్లిం యువతులు ముస్లింలనే పెళ్లి చేసుకోవాలని ఆయన తెలిపారు..మరోవైపు నుస్రత్ జహాన్ ఒక నటి కావడంతో వారు ఇలాంటీవి పాటించరని నాకు తెలుసు, వారు ఎది అనుకుంటారో అదే చేస్తారన్నారు..వాళ్ల వ్యక్తిగత జీవీతం గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరలేదని చెప్పిన ముఫ్తి... మరోవైపు వారి గురించి మాట్లాడడం కూడ సమయం వృధా అవుతుందని అన్నారు.. ఇక షరియత్‌లో ఏముందో తెలియ చేసేందుకే ఫత్వా జారీ చేశామని వివరణ ఇచ్చాడు.

హిందువులను పెళ్లి చేసుకున్న వారు బుర్కాలను ధరించమని ఒత్తిడి
ఇక ముస్లింనేత ఫత్వాలతో చిక్కుల్లో పడ్డ నుస్రత్ జహాన్‌కు బీజేపీ నేత అయిన సాధ్వీ ప్రాచీ అనే బీజేపీ నేత మద్దతుగా నిలిచారు..నుస్రత్ జహాన్‌కు ఫత్వా జారీ చేసిన మత పెద్దలపై ఆమే మండిపడ్డారు...ఈనేపథ్యంలోనే హిందు యువతులను ముస్లింలు లవ్,జిహాద్ పేరిట హిందువులను పెళ్లిలు చేసుకుంటున్నారని అన్నారు..అనంతరం వారిని బుర్కాలు ధరించమని ఒత్తిడి తేవడం ఎంతవరకు సమర్ధిస్తారని ఆమే ప్రశ్నించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications