స్మగ్లర్ వీర్పన్ క్లోజ్ ఫ్రెండ్, 22 మంది హత్య కేసులో నిందితుడు, బెయిల్ మీద వచ్చి ఇంట్లో !
వీరప్పన్ ప్రధాన అనుచరుడు, పాలార్ పేలుడు దోషి జ్ఞానప్రకాష్ (69) క్యాన్సర్‌తో శుక్రవారం మరణించాడని తెలిసింది. కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలోని హనూర్ తాలూకా సందనపాళ్య గ్రామంలో నివసించే జ్ఞానప్రకాష్ శుక్రవరం అనారోగ్యంతో చనిపోయాడు. పాలార్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇతనికి ఉరిశిక్ష పడింది.
2014లో సుప్రీంకోర్టులో జ్ఞానప్రకాష్ అప్పీల్ దాఖలు చేయగా అతని మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. 29 ఏళ్లుగా జైలు జీవితం గడిపిన జ్ఞాన్ ప్రకాశ్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. 2022 డిసెంబర్ 20వ తేదీర జ్ఞానప్రకాష్ ను మానవత్వం ఆధారంగా సుప్రీం కోర్ట్ లో బెయిల్ పొంది అతని ఇంటికి చేరాడు. జ్ఞాన్ ప్రకాష్ అతని భార్య, పిల్లలతో ఇన్ని రోజులు గడిపి శుక్రవారం అందరిని వదిలి వెళ్లిపోయాడని అతని బంధువులు తెలిపారు.

పాలార్ బాంబు కేసులో ప్రమేయం ఉన్న సైమన్, బిల్వేంద్రన్‌లు ఇప్పటికే మరణించగా 2004లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కూడా హతమయ్యాడు. మహదేశ్వర కొండకు ఆనుకుని ఉన్న గ్రామం పాలార్. గతంలో స్మగ్లర్ వీరప్పన్ పాలార్ గ్రామం చుట్టూ దాదాపు 50 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆక్రమించాడు. 1992 ఏప్రిల్ 9వ తేదీన అప్పటి తమిళనాడు ఎస్టీఎఫ్ చీఫ్ గోపాలకృష్ణ, అతని బృందంపై దాడి చేసేందుకు వీరప్పన్ సహచరులు పథకం వేశారు.
భారీగా బాంబులు భద్రపరిచిన వీరప్పన్ సహచరులు పాలార్ సమీపంలోని సొర్కైపట్టి సమీపంలో మందుపాతర అమర్చారు. తమిళనాడు సరిహద్దులోని పాలార్‌కు ఇన్‌ఫార్మర్లతో పాటు గోపాలకృష్ణతో కూడిన ప్రత్యేక బృందం బయలుదేరింది. ఆ సందర్బంలో స్మగ్లర్ వీర్పన్ ప్రియశిష్యుడు సైమన్ పేల్చిన మందుపాతర కారణంగా 22 మంది మరణించారు. ఇదే దాడిలో చాలా మంది గాయపడ్డారు.
ఈ ఘటనకు సంబంధించి వీరప్పన్ సహా 124 మందిపై కర్ణాటక, తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. 1993 ఏప్రిల్ 9వ తేదీన కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని పాలార్‌లో మందుపాతర పేల్చి 22 మంది పోలీసులను హతమార్చడంతోపాటు పలువురిని గాయపరిచినందుకు జ్ఞానప్రకాష్, సైమన్ ఆంటోనియప్ప, మీసేకర మాదయ్య, బిలవేంద్రన్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

1994లో టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ (టాడా) నిరోధక చట్టం కింద ఈ కేసుకు సంబంధించి అరెస్టు అయిన 124 మందిలో ఈ నలుగురు ఉన్నారు. వీరిలో 117 మందిని నిర్దోషులుగా విడుదల చేయగా 7 మందికి జీవిత ఖైదు విధించింది. మైసూర్ సెంట్రల్ జైలులో ఉన్న నలుగురికి 2004లో ఉరిశిక్ష విధించడంతో బెళగావిలోని హిండలగా సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే 2014లో సుప్రీంకోర్టు జ్ఞానప్రకాష్ ఉరి శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. అయితే అనారోగ్యంతో భాదపడుతున్న జ్ఞానప్రకాష్ శుక్రవారం అతని సొంత ఊరిలో చనిపోయాడు.












Click it and Unblock the Notifications