వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్లౌడ్ కవర్ రాడార్ థియరీ: నరేంద్ర మోడీతో నెటిజ‌న్ల ఎకసెక్కాలు!

|
Google Oneindia TeluguNews

న్యూ ఢిల్లీ: సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫాంపై భారతీయ జ‌న‌తా పార్టీకి చెప్పుకోద‌గ్గ పేరు ఉంది. దానికి అనుగుణంగా ఫాలోవ‌ర్లూ ఉన్నారు. ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ వంటి ప్లాట్‌ఫాంల‌ను హ్యాండిల్ చేయ‌ద‌గ్గ స‌త్తా కూడా ఆ పార్టీకి ఉంది. వీకెండ్స్‌ల‌ల్లో బీజేపీ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో స‌ర‌దా కోసమో లేక చుర‌క‌లు అంటించ‌డానికో తెలియ‌ట్లేదు గానీ.. కొంత‌మంది నెటిజ‌న్లు బీజేపీని టార్గెట్‌గా చేసుకున్నారు. ట్విస్ట్ ఏమిటంటే- ఈ టైప్ నెటిజన్లు ఏ పార్టీకి చెందిన వారు కాదు. ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌మలోని సృజ‌నాత్మ‌క‌ను బ‌య‌ట పెట్టేసుకోవ‌డానికి బీజేపీని ఓ సెంట‌ర్ పాయింట్‌గా చేసుకుంటార‌న్న మాట‌!అప్పుడ‌ప్పుడు కొంద‌రు కాంగ్రెస్ నేతాశ్రీలు కూడా వారితో చేయి క‌లుపుతుంటారు. బీజేపీ గానీ, మోడీ గానీ అమిత్‌షా గానీ.. ఎవ్వ‌రైనా ఒక్క‌టే అన్న‌ట్టుగా చెణుకులు, చుర‌క‌లు అంటిస్తుంటారు.

Cloud cover and radar theory: Why Twitter is on cloud 9 after the Prime Ministers statement

మొన్నామ‌ధ్య న‌రేంద్ర‌మోడీ ఓ నేష‌న‌ల్ ఛాన‌ల్‌కు ఓ ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై వైమానిక దాడులు, స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ వంటి అంశాల‌పై మోడీ మాట్లాడారు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ కు ముందు వాతావరణ విషయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని చెప్పుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఇంట‌ర్వ్యూలో ఎక్కువ సార్లు క్లౌడ్‌, క్లౌడ్ క‌వ‌ర్, రాడార్‌ అనే ప‌దాలు దొర్లిన‌ట్టున్నాయి. ఇక అంతే! వాటిని అడ్డు పెట్టుకుని ఓ ఆట ఆడారు నెటిజ‌న్లు. ఆ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఓ చిన్న పార్ట్‌ను క‌త్తిరించేసి, సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో మోడీ వాడిన ప‌దాల‌కు అనుగుణంగా ఫొటోలు, వ‌ర్ణ‌న‌లు చేస్తూ చెల‌రేగిపోయారు. సాధార‌ణ ప‌రిభాష‌లో చెప్పాలంటే న‌రేంద్ర మోడీ గాలి తీసేశారు. సామాజిక, రాజకీయ అంశాలపై మన నెటిజన్లకు ఉన్న సృజనాత్మతకు జోహార్ చెప్పాలనిపిస్తుంది.

English summary
A now deleted video, shared from the official handle of the Bharatiya Janata Party, shook Twitter out of its leisurely Saturday stupor. And the memes that followed were just priceless! For most of us hunting for entertainment on the world wide web, this was the silver lining in the 'cloud' moment!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X