Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్‌పై పగ, తనపై నిఘా.. ఎందుకు జగనన్న: రఘురామ కృష్ణరాజు

సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూతో ఆయన ముందుకు వస్తారు. ఈ సారి.. పవన్, తాను.. జగన్ ప్రభుత్వానికి టార్గెట్ అయ్యామని చెప్పారు. జగన్ సర్కార్‌ను ఎప్పటికప్పుడు విమర్శిస్తూ ప్రభుత్వానికి కంట్లో నలుసుగా మారారు. ప్రతిరోజు రచ్చబండ పేరుతో మీడియా సమావేశాలు నిర్వహిస్తూ.. ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.

 ఎందుకు అపసోపాలు..

ఎందుకు అపసోపాలు..


తనపై నిఘా, పవన్‌పై పగ జగనన్నకి ఎందుకు?.. అని రఘురామ అడిగారు. భీమ్లానాయక్‌లో పవన్‌ అద్భుతంగా నటించారు. పవన్‌ యాక్షన్‌ చేస్తే.. మంత్రి పేర్నినాని ఓవర్‌ యాక్షన్‌ చేశారు. కొన్ని చోట్ల థియేటర్లు బంద్ చేశారు. అరాచకాలు సృష్టించారు. అవసరం లేకపోయినా సినిమా విషయంలో సీఎం జగన్ అల్లరి పాలయ్యారు. జగన్ వైఖరితో మా పార్టీ దెబ్బతింటుందని రఘురామ విమర్శలు సంధించారు.

 సీబీసీఐడీ నిఘా

సీబీసీఐడీ నిఘా


ఎంపీ రఘురామరాజు కదలికలపై ఏపీ సీబీసీఐడీ నిఘా పెట్టిన సంగతి తెలిసిందే. రఘురామరాజు ఇంటి దగ్గర ఏపీ ఐబీ అధికారులు కాపుకాశారు. ఐబీ అధికారుల కళ్లుగప్పి ఆయన ఢిల్లీ చేరుకున్నారు. గతంలో దాఖలైన కేసులో విచారణకు రావాలని సీబీసీఐడీ నోటీసులు జారీ చేసింది. తనకు ఆరోగ్యం బాగాలేదని విచారణకు రఘురామ హాజరుకాలేదు. పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయని సీబీసీఐడీకి సమాచారం ఇచ్చారు. అప్పటి నుంచి రఘురామకృష్ణరాజు ఢిల్లీలోనే ఉన్నారు.

అందుకే ఇలా..?

అందుకే ఇలా..?


మరోవైపు జనసేనాని జగన్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. తనను విమర్శించడాన్ని సహించలేని జగన్‌ ఇప్పుడు 'భీమ్లా నాయక్‌'పై పడ్డారు. పవన్‌ కల్యాణ్‌, రానా నటించిన 'భీమ్లా నాయక్‌' సినిమా శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. రెవెన్యూ అధికారులు అందరూ తమ పనులు వదిలేసి సదరు చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్లలో తనిఖీలకు బయలుదేరారు. ఫలానా సినిమా విడుదల సందర్భంగా తనిఖీలు చేయాలని ప్రభుత్వ ఆదేశాలలో పేర్కొన్నారంటే పాలకుల నైజం ఏమిటో తెలుస్తుందని రఘురామ అన్నారు.

సూపర్ డూపర్ హిట్

సూపర్ డూపర్ హిట్

'భీమ్లా నాయక్‌'కు ఎన్ని ఆటంకాలు కల్పించినా ఆ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అన్న టాక్‌ సొంతం చేసుకుంది. ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించిన పవన్‌ కల్యాణ్‌ అభిమానులు పలు థియేటర్ల వద్ద ఆందోళన చేశారు. జనసేన శ్రేణులు కూడా తప్పుపట్టారు. ప్రకాశ్ రాజ్, నటుడు పృథ్వీ కూడా స్పందించారు. ఈ క్రమంలో రఘురామ కూడా తోడయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+