CM: మీది ముగిసిపోయిన అధ్యాయం, మీది స్కామ్ లు మూసివేసిన ప్రభుత్వం, సీఎంకు కోపం వచ్చి !

బెంగళూరు: ఎప్పుడు సైలెంట్ గా ఉండే ముఖ్యమంత్రికి కోపం వచ్చింది. అర్బాటాలకు దూరంగా ఉంటూ సీఎం అయినా సామాన్యుడిలా ఉండే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ఆ రాష్ట్ర మాజీ సీఎం సిద్దరామయ్యకు చురకలు అంటించారు. మీది ముగిసిపోయిన అధ్యాయం, మీది స్కామ్ ల కేసులు మూసి వేసిన ప్రభుత్వం, మీరు ఎప్పుడు ఏమి మాట్లాడుతారో మీకే తెలీదు అంటూ బసవరాజ్ బోమ్మయ్ మండిపడ్డారు. గతంలో అధికారంలో ఉన్న సిద్దరామయ్య ప్రభుత్వం స్కామ్ ల ప్రభుత్వం అని, అన్ని స్కామ్ ల కేసులు మూసివేసిన ఘనత మీదే అని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్దరామయ్య మీద విరుచుకుపడ్డారు.

 ఎస్ఐ స్కామ్ కేసు

ఎస్ఐ స్కామ్ కేసు

కర్ణాటకలో ఎస్ఐ ఉద్యోగాల స్కామ్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఎస్ఐ ఉద్యోగాల స్కామ్ లో ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు పోలీసు అధికారులు అరెస్టు అయ్యారు. ఎస్ఐ ఉద్యోగాల స్కామ్ కు సంబంధించి మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సిద్దరామయ్య బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

 మండిపడిన సీఎం బసవరాజ్ బోమ్మయ్

మండిపడిన సీఎం బసవరాజ్ బోమ్మయ్

ఇటీవల ఏడీజీపీ స్థాయి ఐపీఎస్ అధికారి అరెస్టు అయ్యారు. ఏడీజీపీ స్థాయి అధికారి అరెస్టు కావడం కర్ణాటక చరిత్రలో ఇదే మొదటిసారి. విషయంలో సిద్దరామయ్య కర్ణాటకలోని బసవరాజ్ బోమ్మయ్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎప్పుడు సైలెంట్ గా ఉండే సీఎం బసవరాజ్ బోమ్మయ్ సిద్దరామయ్య మీద, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద విరుచుకుపడ్డారు.

 మీది ముగిసిపోయిన ప్రభుత్వం.... గుర్తు పెట్టుకోండి

మీది ముగిసిపోయిన ప్రభుత్వం.... గుర్తు పెట్టుకోండి

మీది ముగిసిపోయిన ప్రభుత్వం, స్కామ్ లకు పెట్టింది పేరు గతంలో ఉన్న సిద్దరామయ్య ప్రభుత్వం అని ప్రజలు చెబుతున్నారని బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు. పీయూసీ (ఇంటర్) పరీక్షల్లో పాస్ చేస్తామని డీఎస్పీ స్థాయి ఉద్యోగి ఓ గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుని రూ. 8 కోట్లకు పైగా వసూలు చేస్తే అలాంటి కేసు నీరుగార్చి ఆ కేసును మూసివేసింది సిద్దరామయ్య ప్రభుత్వం అని అందరికి తెలుసని బసవరాజ్ బోమ్మయ్ మండిపడ్డారు.

 ఎవరు గొప్ప అని ప్రజలే చెబుతారు

ఎవరు గొప్ప అని ప్రజలే చెబుతారు

తప్పు చేసిన ఏడీజీపీ స్థాయి అధికారిని అరెస్టు చేసి జైలుకు పంపించిన మమ్మల్ని కర్ణాటక ప్రజలు అభినందిస్తున్నారని, మీరు మాత్రం రాజకీయ కక్షలతో మా మీద విమర్శలు చేస్తున్నారని బసవరాజ్ బోమ్మయ్ మాజీ సీఎం సిద్దరామయ్య మీదమండిపడ్డారు. చేతిలో పని లేక చేతకాని నాయకులు మా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని బసవరాజ్ బోమ్మయ్ ఆయన ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న నాయకుల మీద విరుచుకుపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+