వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హ్యాపీ వినాయక చవితి: కేసీఆర్, చంద్రబాబు, పవన్ విషెస్

|
Google Oneindia TeluguNews

గణపతి పండగ సందర్భంగా అంతా ఒక్కటే హడావిడి.. పండగ సందర్భంగా ప్రముఖులు విష్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సుఖశాంతులతో కూడిన జీవితం సాకారమయ్యేలా ఆ ఏకదంతుని దీవెనలు దేశ ప్రజలందరికీ అందాలని ప్రార్థిస్తున్నానని సీఎం కేసీఆర్ తెలిపారు.

భక్తి శ్రద్దలతో..

భక్తి శ్రద్దలతో..

సుఖ సంతోషాలు..బుద్ధి, జ్ఞానానికి ఆరాధ్యుడుగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా హిందువులు భక్తిశ్రద్ధలతో గణేశుడిని ఆరాధిస్తారని అన్నారు. వినాయకచవితి మనకు జ్ఞానం, నైతిక విలువలు, లక్ష్యసాధన, ప్రకృతి పరిరక్షణ వంటి సుగుణాలను మనకు నేర్పుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. వినాయక నవరాత్రులను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

అందరూ..


వినాయకచవితి అందరూ కలసిమెలసి జరుపుకునే పండుగ అని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. హిందూయేతర మత విశ్వాసాలను పాటించేవారు కూడా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వినాయక ఉత్సవాల్లో పాల్గొంటారని పవన్ వెల్లడించారు. హైదరాబాద్ వంటి నగరాల్లో నిమజ్జనం సందర్భంగా ముస్లిం సోదరులు తాగునీరు, అల్పాహారాలు అందించడం మత సామరస్యానికి నిదర్శనంలా నిలుస్తాయని పేర్కొన్నారు. మహత్తరమైన తొలి పండుగ వినాయక చతుర్థి సందర్భంగా దేశ ప్రజలకు, ముఖ్యంగా తెలుగువారికి తమ పక్షాన, జనసేన పక్షాన భక్తిపూర్వక శుభకాంక్షలు తెలియజేశారు.

సామాజిక స్ఫూర్తి


టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వినాయక చవితి పర్వదినం నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా విష్ చేశారు.వినాయక చవితి కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రజలను ఏకంచేసి, వారిలో జాతీయ భావాన్ని నింపేందుకు దోహదపడిన ఒక సామాజిక స్ఫూర్తి అని పేర్కొన్నారు. గణేశ్ ఉత్సవాలపై అనుమతుల పేరుతో ఆంక్షలు సరికాదన్నారు.

English summary
cm kcr, chandra babu, pawan kalyan wish to people for the eve of vinayaka chaviti.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X