వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గడ్కరీతో కేసీఆర్ భేటీ: జాతీయ రహదారులపై విన్నపాలు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీగా ఉన్నారు. ప్రధాని మోడీకి తమ సమస్యలను సంగతి తెలిసిందే. ఇవాళ కేంద్ర ఉపరితల రవాణ,జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం అయ్యారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ, ఆధునీకరణ, కొత్త లైన్ల మంజూరుకు సంబంధించి ప్రతిపాదనలను సీఎం కేసీఆర్, గడ్కరీకి అందచేశారు.

Deepika Padukone:పసుపు రంగు చీరలో బోల్డ్ బ్యూటీ (ఫొటోస్)Deepika Padukone:పసుపు రంగు చీరలో బోల్డ్ బ్యూటీ (ఫొటోస్)

ఎన్ హెచ్ 165 హైదరాబాద్ (ఓఆర్ఆర్) కల్వకుర్తి వరకు ఉన్న రహదారి నాలుగు లైన్ల రహదారిగా గుర్తించాలని సిఎం కేసీఆర్ గడ్కరీని కోరారు. 2021-2022, 2022-2023 రెండు ఆర్థిక సంవత్సరాల్లో సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్) కింద పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనలను తక్షణమే ఆమోదించాలని కూడా సీఎం గడ్కరీ కి విజ్ఞప్తి చేశారు.

cm kcr meets central minister nitin gadkari

సీఆర్ఐఎఫ్ కింద ఏడాదికి రూ.‌ 250 కోట్లు రాష్ట్రానికి అదనపు నిధులు కేటాయించాలని కోరారు. చౌటుప్పల్-షాద్ నగర్- సంగారెడ్డి మధ్య 182 కిలో మీటర్ల సదరన్ ఎక్స్‌ప్రెస్ వే (రీజనల్ రింగ్ రోడ్డు)ను మంజూరు చేయాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన ఎన్ హెచ్ 65 ను ఆరు లైన్ల రహదారిగా మార్చే అంశంపై దృష్టి సారించాలని కేసీఆర్ ఇచ్చిన వినతిపత్రంలో పేర్కోన్నారు.

ఎన్ హెచ్ 65 ను ఆరు లైన్ల రహదారి నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని...నాలుగు కీలకమైన రాష్ట్ర రహదారులు.. చౌటుప్పల్-అమన్ గల్- షాద్ నగర్- కందీ, కరీంనగర్-సిరిసిల్ల-కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం, కొత్త కోట-గూడురు మీదుగా మంత్రాలయం వరకు, బీదర్-జహీరాబాద్-బీదర్ లను జాతీయ రహదారులుగా మంజూరు చేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం కేసీఆర్ ఈ మధ్య సమావేశం అయ్యారు. 50 నిమిషాలు జరిగిన సమావేశంలో 10 అంశాలపై చర్చ జరిగింది. ఐపిఎస్ క్యాడర్ పై కేంద్రం సమీక్షించాలని మోడీని సీఎం కేసీఆర్ కోరారు. అలాగే రాష్ట్రంలో సమీకృత టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్- నాగపూర్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేయాలని విన్నవించారు. కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు అదనపు నిధులివ్వాలని పేర్కొన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన మెరుగుపరచాలని కోరారు. కరీంనగర్ లో ట్రిపుల్ ఐటి ఏర్పాటు చేయాలని.. హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు చేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని.. 10 అంశాలకు సంబంధించిన లేఖలు అందజేశారు.

English summary
cm kcr meets central minister nitin gadkari. he request various roads for national highways.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X