వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుబ్రమణ్య స్వామి, రాకేశ్ టికాయత్‌తో కేసీఆర్ లంచ్.. జాతీయ రాజకీయాలపై చర్చ

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఫెడరల్ ఫ్రంట్ అంటోన్న ఆయన.. వరసగా సమవేశాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెసేతర కూటమి కోసం జట్టు కట్టబోతున్నారు. వాస్తవానికి గత ఎన్నికల సమయంలోనే ఆయన ప్రయత్నం చేశారు. కానీ బీజేపీకి బంపర్ మెజార్టీ రావడంతో ఆయన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇప్పుడు మళ్లీ నేతలను కలుస్తున్నారు.

బిజీ బిజీ

సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో తీరిక లేకుండా ఉన్నారు. సీఎం కేసీఆర్‌తో బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యులు సుబ్రమణ్య స్వామి, భార‌తీయ కిసాన్ యూనియ‌న్ నాయ‌కులు రాకేశ్ తికాయ‌త్ భేటీ అయ్యారు. ప్ర‌స్తుతం దేశంలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌తోపాటు భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌పై చ‌ర్చించారు. కేసీఆర్‌తో క‌లిసి సుబ్రమణ్య స్వామి, రాకేశ్ తికాయ‌త్ లంచ్ చేశారు. వారితోపాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు.

జాతీయ కూటమి..

బీజేపీ, కాంగ్రెసేత‌ర పార్టీల‌తో జాతీయ స్థాయి కూట‌మిని ఏర్పాటు చేసేందుకు వివిధ పార్టీల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే ప‌నిలో కేసీఆర్ ఉన్న‌ారు. ఇటీవ‌ల మ‌హారాష్ట్ర‌లో ప‌ర్య‌టించారు. మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక‌రేతో పాటు ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్‌తో కేసీఆర్ స‌మావేశ‌మయ్యారు. జాతీయ రాజ‌కీయాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. అంతకుముందు తమిళనాడు సీఎం స్టాలిన్.. అంతకుముందు బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కూడా భేటీ అయ్యారు.

కేసీఆర్ ఆలోచన ఇదేనా..?

కేసీఆర్ ఆలోచన ఇదేనా..?


ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు. కానీ కేసీఆర్ మాత్రం వేగంగా పావులు కదుపుతున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. ఇటీవల ప్రధాని మోడీపై కూడా విమర్శలు చేస్తున్నారు. అంతకుముందు టీఆర్ఎస్- బీజేపీ.. భాయి భాయి అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. ఇటు కాంగ్రెస్ పార్టీతో కూడా కేసీఆర్ సఖ్యంగా లేరు. ఫెడరల్ ఫ్రంటే తమ లక్ష్యం అని.. అందుకోసం జట్టు కట్టే పనిలో ఉన్నారు. సుబ్రమణ్య స్వామి బీజేపీలో సీనియర్ నేత. కంటిలో నలుసు మాదిరిగా విమర్శలు చేస్తూ ఉంటారు. రాకేశ్ టికాయత్ రైతు నేత.. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంలో కీ రోల్ పోషించారు. వీరిద్దరినీ కేసీఆర్ కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది.

English summary
cm K Chandrashekhar Rao was busy on Thursday meeting with like-minded politicians in New Delhi. he met BJP Rajya Sabha member Dr Subramanian Swamy and farmers leader Rakesh Singh Tikait
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X