వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకప్పటి ఛాంపియన్ నడిరోడ్డుపై నూడుల్స్ అమ్ముతోంది

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

వడోదర: భారతదేశంలో క్రీడాకారులకు ప్రోత్సాహం లేదు అనే దానికి ఇదొకటి చక్కని ఉదాహరణ. మన దేశంలో క్రీడాకారులకు ప్రతిభ ఉన్నా ఎంతో మంది నిరాధరణకు గురవుతున్నారనే ఉన్నారు. తాజాగా పుష్ప గుప్తా అనే 21 ఏళ్ల యువతి ఒకప్పుడు షూటింగ్‌లో జాతీయ చాంపియన్ అనిపించుకుంది.

అయితే ప్రస్తుతం ఇప్పుడామె రోడ్డు పక్కన బండి పెట్టుకుని నూడుల్స్ అమ్ముకుంటోంది. తన కుటుంబ పోషణ కోసమే తానీ పని చేస్తున్నానని వాపోయింది. అయితే ఆమె తన నూడుల్స్ బండి వద్దకు మరింత మంది కస్టమర్లను ఆకర్షించేందుకు గాను నూడుల్స్ అమ్ముతోన్న బండికి షూటింగ్ పోటీల్లో తాను సాధించిన మెడల్స్‌ను వేలాడ దీసింది.

CM KCR Praises services of BR Ambedkar on his Birthday

దీంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2013లో కాలేజీలో చేరానని తెలిపింది. ఆ తర్వాత తనకు షాటింగ్‌లో మంచి ప్రతిభ ఉందని గుర్తించి, ఎన్‌సీసీలో చేరానని తెలిపింది. ఎన్‌సీసీలో ఉండగా ఆర్థికంగా సహాయం లభించిందని తెలిపింది.

గుజరాత్‌లో జరిగిన స్పోర్ట్స్‌లో తాను పాల్గొన్నానని వివరించింది. ప్రస్తుతం తనకు ఆర్థిక పరిస్థితి బాగులేనందున కుటుంబ పోషణ నిమిత్తం నూడుల్స్ అమ్ముకుంటున్నానని తెలిపింది.

English summary
In a country like India, which boasts some of the richest sportspersons in the world, there is a female champion who has been neglected to such levels that she now sells noodles on the roadside in order to earn her daily livelihood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X