వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం రమేశ్‌కు కీలక పదవీ, రాజ్యసభ హసింగ్ కమిటీ చైర్ పర్సన్‌గా నియామకం

|
Google Oneindia TeluguNews

బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్‌కు కీలక పదవీ వరించింది. రాజ్యసభ హౌసింగ్ కమిటీ చైర్ పర్సన్‌గా అవకాశం లభించింది. మాజీ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు రాజ్యసభ ఎథిక్స్ కమిటీ చైర్‌పర్సన్ పదవీ వరించింది. రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్ పలు కమిటీలకు కొత్త చైర్‌పర్సన్లను నియమించారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసింది.

ప్రకాశ్ జవదేకర్‌‌కు కీలకమైన రాజ్యసభ ఎథిక్స్ కమిటీ చైర్‌పర్సన్ పదవీ దక్కింది. ఇందులో సభ్యులుగా టీఎంసీ నుంచి డెరెక్ ఒబ్రెయిన్, కాంగ్రెస్ పార్టీ నుంచి జైరామ్ రమేశ్, బీజేడీ నుంచి సస్మిత్ పాత్రా, వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి ఉన్నారు. సీఎం రమేశ్‌కు హౌసింగ్ కమిటీ చైర్‌పర్సన్‌ పదవీ లభించింది. బీజేడీ ఎంపీ సుజీత్ కుమార్‌ను రాజ్యసభ పిటిషన్స్ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమించారు.

cm ramesh appointmented as rajya sabha housing committee chair person

డీఎంకే ఎంపీ ఎం తంబిదురైని ప్రభుత్వ అస్యురెన్స్‌ ప్యానెల్ సభ్యునిగా నియమించారు. బీజేపీ చీఫ్ విప్ లక్ష్మీకాంత్ బాజ్‌పేయీకి సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్‌పర్సన్ అయ్యారు. బీజేపీ ఎంపీ కామాఖ్య ప్రసాద్ టసను ఓ కమిటీకి చైర్‌పర్సన్‌ బాధ్యతలను అప్పగించారు. ఇలా పలువురికి కొత్త బాధ్యతలను అప్పగించారు.

సీఎం రమేశ్ టీడీపీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు సుజనా చౌదరి కూడా బీజేపీలో చేరారు. ఇప్పుడు సీఎం రమేష్‌కు పదవీ వరించింది. అయితే వీరు కేంద్ర ప్రభుత్వం నుంచి కేసులను ఎదుర్కొంటున్నారని.. అందుకే పార్టీ మారారని అప్పట్లో విమర్శలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.

English summary
bjp mp cm ramesh appointmented as a rajya sabha housing committee chair person.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X