బెంగాల్ లో కీలక పరిణామం- సీబీఐకి అప్పగింత, సిట్
పశ్చిమ బెంగాల్ లో ఊహించిందే జరుగుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి రోజుల్లోనే ముఖ్యమంత్రి సువేందు అధికారి తడాఖా చూపుతున్నారు. కొరడా ఝుళిపిస్తోన్నారు. తాము అధికారంలోకి వస్తే తృణమూల్ కాంగ్రెస్ లోని అవినీతిపరులందరినీ అరెస్ట్ చేయిస్తానంటూ అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన మాట కూడా నిలుపుకొంటోందక్కడి బీజేపీ సర్కార్.
ఈ పరిస్థితుల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ హత్య కేసు దర్యాప్తులో సీబీఐ ఎంట్రీ ఇచ్చింది. నేటి నుంచి విచారణ చేపట్టనుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని గతంలో పశ్చిమ బెంగాల్ పోలీసులు సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సీబీఐ అడుగు పెట్టింది. రాష్ట్ర పోలీసుల నుంచి ఈ దర్యాప్తు బాధ్యతలను సీబీఐ అధికారికంగా స్వీకరించింది కూడా.

ఈ కేసును పరిశోధించడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది సీబీఐ. మొత్తం ఏడుమందితో కూడిన సిట్ ఇది. ఇందులో..
పంకజ్ కుమారర్ సింగ్- డీఐజీ, సీబీఐ ఢిల్లీ
సుభాష్ చంద్ర కుందు- ఎస్పీ, సీబీఐ ఢిల్లీ
అనిల్ కుమార్ యాదవ్- డీఎస్పీ, సీబీఐ, ఢిల్లీ
వికాస్ పాథక్- డీఎస్పీ, సీబీఐ (ఏసీబీ ధన్ బాద్)
అమిత్ కుమార్- డీఎస్పీ, సీబీఐ (ఏసీబీ పాట్నా)
కుల్ దీప్- డీఎస్పీ, సీబీఐ (ఏసీబీ రాంచీ)
వివేక్ శ్రీవాస్తవ- ఇన్ స్పెక్టర్, సీబీఐ (ఏసీబీ లక్నో) .. ఉన్నారు.
ఈ సిట్ దర్యాప్తును కోల్‌కతా జోన్ జాయింట్ డైరెక్టర్/హెడ్ ఆఫ్ జోన్ పర్యవేక్షిస్తారు. ఈ హత్యకేసులో ఇప్పటికే ముగ్గురు షూటర్లు అరెస్ట్ అయ్యారు. వీరిని ఉత్తరప్రదేశ్‌లో అరెస్ట్ చేశారు. దీని తర్వాతే ఈ కేసు సీబీఐ బదిలీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications