వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ మెజార్టీతో యోగీ ఆదిత్య‌నాథ్‌ గెలుపు; గోరఖ్‌పూర్ లో మిన్నంటిన సంబరాలు

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార బీజేపీ మరోమారు ఘనవిజయం సాధించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు యోగి ఆదిత్యనాథ్ గురువారం గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గం నుండి లక్షా ఒక వెయ్యి ఓట్ల భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. గోరఖ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన యోగి ఆదిత్యనాథ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. బిజెపి నిర్ణయాత్మక విజయాన్ని నమోదు చేయడంతో పాటు, ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ నుండి విజయం సాధించడంతో, గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో భారతీయ జనతా పార్టీ విజయోత్సవ సంబరాలు జరుపుకుంటుంది.

బుల్డోజర్ లపై బీజేపీ కార్యకర్తల సంబరాలు; యోగి వేషధారణలో చిన్నారుల ఫోటోలు వైరల్బుల్డోజర్ లపై బీజేపీ కార్యకర్తల సంబరాలు; యోగి వేషధారణలో చిన్నారుల ఫోటోలు వైరల్

భారత ఎన్నికల సంఘం ప్రకారం, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆదిత్యనాథ్‌ ఆయన సమీప ప్రత్యర్థి ఎస్పీ అభ్యర్థి సుభావతి ఉపేంద్ర దత్ శుక్లాపై భారీ మెజార్టీ తో గెలుపొందారు. యోగి ఆదిత్యనాథ్ 2017 వరకు గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. తరువాత రాష్ట్ర ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం తర్వాత ఆయన యూపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు . గోరఖ్‌పూర్ సదర్ సీటు కూడా బిజెపికి కంచుకోటగా ఉంది. అక్కడ జన్ సంఘ్ కాలం నుండి 1967 నుండి పార్టీ ఎన్నడూ ఓడిపోలేదు.

CM Yogi Adityanath Wins from Gorakhpur Urban with a huge majority; Celebrations in Gorakhpur

యోగి ఆదిత్యనాథ్ ఒక ముఖ్యమంత్రిగా పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే కాకుండా తాను వ్యక్తిగతంగా ఘన విజయాన్ని సాధించారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్న తరుణంలో భారత ఎన్నికల సంఘం తాజా ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 13 స్థానాల్లో, 237 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. సమాజ్‌వాదీ పార్టీ 116 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ రెండు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. భారతీయ జనతా పార్టీ మునుపటికంటే ఓ 40 స్థానాలు తగ్గినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను దాటి అత్యధిక స్థానాలను సాధించింది.

ఈ ఎన్నికలలో వ్యవసాయ చట్టాలు, లఖింపూర్ ఖేరి ఘటన, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి పై ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా చివరకు యోగి మాయాజాలమే విజయం సాధించింది. ప్రజలు బీజేపీపై ప్రతిపక్షాల విమర్శలను ఏ మాత్రం పట్టించుకోలేదు. మరోమారు యూపీ ప్రజలు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి పట్టం కట్టారు.

English summary
UP CM Yogi Adityanath won a solid victory with a huge majority. Gorakhpur BJP activists celbrating the victory in Gorakhnath Temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X