కర్ణాటకలో నిఫా వైరస్ ప్రభుత్వం, కుప్పకూలుతుంది, కేంద్ర మంత్రి, అసమ్మతి ఎమ్మెల్యేలు!
బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోతే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి డివి. సదానంద గౌడ జోస్యం చెప్పారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కర్ణాటకకు నిఫా వైరస్ లాగా పట్టుకుందని కేంద్ర మంత్రి సదానంద గౌడ ఎద్దేవ చేశారు. అసమ్మతి ఎమ్మెల్యేలు రోజురోజుకు పెరిగిపోతున్న సమయంలో కేంద్ర మంత్రి సదానంద గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నిఫా వైరస్
కర్ణాటకలోని హాసన్ లో మంగళవారం కేంద్ర మంత్రి సదానందగౌడ మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్-జేడీఎస్ నిఫా వైరస్ ప్రభుత్వం ఉందని కేంద్ర మంత్రి సదానందగౌడ ఎద్దేవ చేశారు. నిఫా వైరస్ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోయినా అందులో ఆశ్చర్యం లేదని, త్వరలో ప్రభుత్వం కూలిపోంతుందని సదానంగౌడ జోస్యం చెప్పారు.
Recommended Video


మంత్రి వర్గం లేదు
కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ప్రస్తుతం మంత్రి వర్గం ఏర్పాటు చెయ్యలేక సతమతం అవుతోందని, ఇక ప్రజల కష్టాలు గురించి పట్టించుకునే తీరిక వీరికి ఎక్కడ ఉందని కేంద్ర మంత్రి సదానందగౌడ ప్రశ్నించారు. పదవుల కోసం వీరు పోట్లాడుకుంటున్నారని కేంద్ర మంత్రి సదానంద గౌడ విమర్శించారు.

లోక్ సభ ఎన్నికలు
2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ పొత్తు విషయంలో మాట్లాడిన కేంద్ర మంత్రి సదానందగౌడ అంత వరకూ ఈ సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందా అని అనుమానం వ్యక్తం చేశారు. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని కేంద్ర మంత్రి సదానందగౌడ అన్నారు.

అసమ్మతి ఎమ్మెల్యేలు
కేంద్ర మంత్రి సదానంద గౌడ మాటలు వింటుంటే కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలలో మంత్రి పదవులు రాకపోవడంతో అసమ్మతితో ఉన్న ఎమ్మెల్యేలు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని తెలిసింది. అసమ్మతి ఎమ్మెల్యేలకు గాలం వేసి కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం.












Click it and Unblock the Notifications